అన్వేషించండి

Amaran OTT: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా ‘అమరన్’... అసలు కారణం ఏమిటో తెలుసా?

Amaran OTT Release: ‘అమరన్’ ఓటీటీ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Amaran OTT Release: తమిళ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘అమరన్’. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలి షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. వసూళ్ల పరంగా రూ. 200 కోట్ల మార్క్ ను దాటేసిన ‘అమరన్’, రూ. 250 కోట్లకు చేరువైంది. ఊహించిన దాని కంటే అద్భుత విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం సంతోషంలో మునిగిపోయింది. “హిట్ అవుతుందనుకున్నాం. కానీ, ఈ స్థాయి సక్సెస్ అవుతుందని ఊహించలేదు” అని మేకర్స్ చెప్పడం విశేషం.   

‘అమరన్’ ఓటీటీ విడుదల మరింత ఆలస్యం

‘అమరన్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. అంటే, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లేదంటే సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని భావించింది. కానీ, ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్ తన రిలీజ్ ప్లాన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో విడుదలను మరో రెండు వారాలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే, ‘అమరన్‘ సినిమా డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.   

‘మేజర్‘ లాగే ‘అమరన్‘, కానీ..

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్‘ లాంటి కథతోనే ‘అమరన్‘ సినిమాను తెరకెక్కించారు. రెండు సినిమాలూ నిజ జీవితాల స్ఫూర్తితో, దేశ రక్షణలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగం చేసిన సైనికుల వీరోచిత గాథలను చెప్పినవే. అయితే, ఈ సినిమా కథ చెప్పే విధానం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య కథ చెప్పడం ఆసక్తిని కలిగిసున్నది. ఈ సినిమాలో ముకుంద్ భార్యగా సాయి పల్లవి నటించింది. ఎప్పటి లాగే ఈ చిత్రంలో తన అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించింది. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. 

మేజర్ ముకుంద్ జీవిత కథ ఆధారంగా..

‘అమరన్’ సినిమాను ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌ లెస్‌: ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించారు. దీపావళికి ఎలాంటి హడావుడి లేకుండా రిలీజై  చక్కటి హిట్ అందుకుంది. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో సూర్య 'కంగువ' చిత్రానికి తలనొప్పిగా మారింది. ఆయనకు  అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరుకుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

Read Also: ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’- దుమ్మురేపుతున్న టామ్‌ క్రూజ్‌ టీజర్‌ ట్రైలర్‌!

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget