అన్వేషించండి

Telangana News: త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR Complaint Against Revanth Reddy: తెలంగాణలో ఎక్కడ లేని అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ స్కీమ్‌లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

KTR Comments On Revanth In Delhi: తెలంగాణలో జరిగిన అమృత టెండర్ల స్కాంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కి తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించిన ఆయన... తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైన స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ టాక్స్ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆధారాలతో సహా తెలంగాణ అమృత్ టెండర్లలో అవినీతిపైన ఫిర్యాదు చేశామని ప్రధానమంత్రి స్పందిస్తారో లేదో చూడాలన్నారు కేటీఆర్. నరేంద్ర మోడీ, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అమృత్ టెండర్లలలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది బిజెపి చిత్తశుద్ధికి ఒక లిట్మస్ పరీక్ష అని గుర్తించాలన్నారు.  

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులకు టెండర్లు ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. రూ. 8888 కోట్లపైగా టెండర్లు ప్రభుత్వం పిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ అవినీతిని ఆపేదాక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాను. ఒకవేళ అమృత్ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అదే మాటను బిజెపి నేతలు, ప్రధానమంత్రి చెప్పాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలపై ఎండగడతామన్నారు.

అమృత్‌ టెండర్ల సమాచారం ఎక్కడా లేకుండా ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు కేటీఆర్. సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా వివరాలు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత బావమరిది సృజన్ రెడ్డికి షోదా కన్‌స్ట్రక్షన్ పేరుతో భారీగా టెండర్లు కట్టబెట్టిందన్నారు. 2 కోట్ల రూపాయల వార్షిక లాభం ఉన్న కంపెనీకి వందల కోట్ల రూపాయల టెండర్లు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. 

ఎలాంటి అర్హతలు లేకున్నా టెండర్లు కట్టబెట్టారన్నారు కేటీఆర్. ఇందుకోసం అన్ని అర్హతలు ఉన్న ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీ ఉపయోగించారన్నారు. కానీ టెండర్లు గెలుచుకున్న కంపెనీ కేవలం 20 శాతం పనులనే చేస్తుందన్నారు. మిగిలింది అంతా కేవలం రెండు కోట్ల రూపాయల వార్షిక లాభం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకీ ఇచ్చారు అన్నారు. ఈ మేరకు ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజికి సమాచారం ఇచ్చారన్నారు. 

అమృత్ టెండర్లపైన కేంద్రమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు కేటీఆర్. పార్లమెంట్ సమావేశాల వరకు సమయం ఇవ్వండని రిక్వస్ట్ చేశారన్నారు. సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వేళ పార్లమెంట్‌ సమావేశాల లోపల కేంద్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపైన స్పందించకుంటే సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.  

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఉన్నాయని ఆరోపించారు కేటీఆర్. ముఖ్యమంత్రిపై వచ్చే విమర్శకు కేంద్రమంత్రి బండి సంజయ్ కాపాడుతున్నారని విమర్శలు చేశారు. 8 మంది ఎంపిలున్నా ఒక్కరు కూడా ప్రభుత్వ అవినీతిపైన మాట్లాడలేదని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలను గొర్రెల్లా బీజేపీ కొంటున్నారు అన్న మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలోని చూడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీనే ఫిరాయింపులు మెదలు పెట్టిందన్నారు. 

తనపై ఎలాంటి కేసు పెట్టుకున్నా, విచారణలు చేసుకున్న భయం లేదన్నారు కేటీఆర్‌. 5 వారాల కింద తెలంగాణ రెవెన్యూ మంత్రిపైన ఈడి దాడి జరిగిందని ఇప్పటిదాకా ఏం జరిగిందో ప్రకటన లేదని తెలిపారు. మంత్రి కూడా మాట్లాడలేదన్నారు. ఈడి దాడి తర్వాత అదే మంత్రితో అదానీ వచ్చి చర్చలు చేశారని గుర్తు చేశారు. ఆ సమావేశాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేబినెట్‌లో కూర్చొని కొడుక్కి టెండర్ల పనులు కట్టబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ అండ్ టి, ఎన్ సిఎల్ కంపెనీల కన్నా రాఘవ కంపెనీ గొప్పది ఎలా అవుతుందన్నారు. 

రాహుల్ గాంధీ మాట్లాడుతున్న క్రోనీ క్యాపిటలిజం సరైన ఉదాహరణలు ఇవేనన్నారు కేటీఆర్. ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతున్న టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని కూడా ముఖ్యమంత్రి తుంగలో తొక్కారన్నారు. 

191 ఆర్టికల్ ప్రకారం గతంలో సోనియాగాంధీ, ఈ మధ్యనే హేమంత్ సురేన్ వంటి నాయకులపైన ఆరోపణలు వచ్చాయన్నారు కేటీఆర్. వారు పదవులు కోల్పోయారని గుర్తు చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి, పొంగులేటి తమ పదవులు కోల్పోతారని జోస్యం చెప్పారు. మహరాష్ట్రలో రాహుల్ గాంధీ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహరాష్ట్ర ఎన్నికలకు 300 కోట్ల తెలంగాణ సొమ్ములు ఖర్చు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. 

కొడంగల్‌లోని  లగుచర్ల ప్రజల అందోళనపై కూడా కేటీఆర్ స్పందించారు. బావమరిదికి అమృతం పంచి సీఎం కొడంగల్ ప్రజలకు విషం పంచుతున్నారని మండిపడ్డారు. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అడ్డగోలు విధానాలపైన ప్రజలు చేసిన తిరుగుబాటు చూశామన్నారు. పోలీస్ రక్షణ లేకుండా ముఖ్యమంత్రి కొడంగల్ పోయే పరిస్ధితి లేదన్నారు. కలెక్టర్‌ను కొట్టే పరిస్ధితి తెలంగాణలో, ఏపిలో ఎప్పుడూ జరగలేదన్నారు. దాడి జరగలేదంటూ కలెక్టర్ స్వయంగా చెప్తున్నప్పుడు కేసులెందుకు, అరెస్టులెందుకని ప్రశ్నించారు. 

Also Read: ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News : ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన
ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
Telangana News: లగచర్ల ఘటనలో 50 మందికిపైగా అరెస్టు- ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి చేశారన్న పోలీసులు
లగచర్ల ఘటనలో 50 మందికిపైగా అరెస్టు- ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి చేశారన్న పోలీసులు
Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ ఇలాకాలో ఇంటర్నెట్ బంద్, ఆ ఊర్లో ఉద్రిక్తతలుఅసభ్య పోస్ట్‌ల వెనక అవినాష్ రెడ్డి! ఆయనదే కీలక పాత్ర - డీఐజీSri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News : ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన
ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
Telangana News: లగచర్ల ఘటనలో 50 మందికిపైగా అరెస్టు- ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి చేశారన్న పోలీసులు
లగచర్ల ఘటనలో 50 మందికిపైగా అరెస్టు- ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి చేశారన్న పోలీసులు
Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Manchu Manoj: ‘భైరవం‘లో మనోజ్ ఫస్ట్ లుక్... మంచు వారి అబ్బాయి మాస్ అవతార్‌ - ఆకట్టుకుంటున్న పోస్టర్
‘భైరవం‘లో మనోజ్ ఫస్ట్ లుక్... మంచు వారి అబ్బాయి మాస్ అవతార్‌ - ఆకట్టుకుంటున్న పోస్టర్
OTT Romantic Drama: థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Latest Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం- మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు
Sita Mai Temple: తెలుగు రాష్ట్రాల్లో సీతమ్మకు ఒకే ఒక ఆలయం - దేశంలో ఇంకెక్కడున్నాయో తెలుసా!
తెలుగు రాష్ట్రాల్లో సీతమ్మకు ఒకే ఒక ఆలయం - దేశంలో ఇంకెక్కడున్నాయో తెలుసా!
Embed widget