అన్వేషించండి

Telangana News : ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన

Telangana News: తెలంగాణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రోజులు వ్యవధిలోనే ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.

Telangana News: ఇన్ని రోజులు తెలంగాణకే పరిమితమైన కుంభకోణాల రాజకీయం ఇప్పుడు ఢిల్లీ చేరింది. తెలంగాణకు చెందిన కీలకమైన ముగ్గురు వ్యక్తులు హస్తినలో మకాం వేయడంతో రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హస్తన వెళ్లారు. మరోవైపు గవర్నర్ ఢిల్లీ పర్యటన అనేక చర్చలకు దారి తీస్తోంది. 

ఢిల్లీలో కేటీఆర్

అమృత్ పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్రమంత్రికి ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. టెండర్లు రద్దు చేసి వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ రెడ్డికి ఈ టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని కుంభకోణాలు రాబోతున్నాయని టీజర్‌ కూడా ఇచ్చేశారు. సీరియల్ మాదిరి అన్ని శాఖల్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను జాతీయ స్థాయిలోనే ఎండగడతామని ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వస్తామని అన్నారు. 

హస్తిన బాట పట్టిన సీఎం రేవంత్

కేటీఆర్ ఢిల్లీ వెళ్లి హడావిడి చేస్తున్న టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తన వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. దీపావళి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై పార్టీలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంది. వీటితోపాటు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా కేంద్రమంత్రులకే ఫిర్యాదులు కూడా చేసింది. ఇన్ని అంశాలు ప్రచారంలో ఉండగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ టూర్ కేవలం అధిష్టానం పెద్దలను కలవడానికే వెళ్లారని అంటున్నారు. ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ ఆ విషయంలో ఏమైనా ఫీడ్ బ్యాక్ ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. 

ఢిల్లీలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ శర్మ 

సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో ఉండగానే తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. ఫార్ములా ఈ- కార్‌ రేస్‌ కేసులో కీలక మలుపు తిరుగుతుందని కీలక వ్యక్తులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు దర్యాప్తు సంస్థలు విన్నవించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కీలకంగా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై ఇంకా గవర్నర్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఈ అంశంపై క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లారా లేకుంటే నార్మల్‌ రివ్యూ ఇవ్వడానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది.   

తెలంగాణలో వివిధ అంశాలపై ఇంత చర్చ జరుగుతున్న వేళ గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ హస్తినలో ఉండటం ఎవరికి తోచినట్టు వాళ్లు విశ్లేషణలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget