Kantara Chapter 1 OTT: 'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే!
Kantara Chapter 1 OTT Platform: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యింది. రిలీజ్‌కు ముందే బిగ్ బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

Rishab Shetty's Kantara Chapter 1 OTT Partner Locked: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. 2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ కాగా... ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా ఓ జానపద అద్భుతాన్ని తెరకెక్కించారు రిషబ్. ఈ మూవీ ఓటీటీ డీల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజ్‌కు ముందే బిగ్ బిజినెస్ డీల్ జరిగింది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
'కాంతార చాప్టర్ 1' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీకి హిట్ టాక్ సొంతం కావడంతో ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే. దాదాపు 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాళువే గౌడ నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
'కాంతార' ఎక్కడితో ఎండ్ అయ్యిందో దానికి ముందు జరిగిన కథ.. పూర్వీకుల చరిత్ర, దైవ గణాలను ప్రీక్వెల్‌లో చూపించారు. పుంజుర్లి దైవ రూపంలో తన తండ్రి ఓ స్థలంలోకి వెళ్లి అదృశ్యం కాగా... అక్కడి నుంచి కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలోని కందబుల రాజ్య పాలనలో ఓ దిక్కున అటవీ ప్రాంతంలో ఉండే దైవిక భూమి 'కాంతార'. అక్కడ ఉండే మహిమ కలిగిన ఈశ్వరుని పూదోట, మార్మిక బావికి ఆ తెగ వారు కాపలా కాస్తుంటారు. అక్కడున్న బావిలో దొరికే బిడ్డను 'బెర్మె' (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి దైవ ప్రసాదంగా బావించి పెంచుతారు 'కాంతార' తెగ ప్రజలు.
ఈశ్వరుని పూదోటపై కన్నేసిన బాంగ్రా రాజు దైవ గణాల కన్నెర్రతో ప్రాణాలు కోల్పోతాడు. అతని కుమారుడు రాజశేఖరుడు (జయరాం) భయంతో 'కాంతార' జోలికి వెళ్లడు. ఇక అతని వారసుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) రాజ్యం చేజిక్కించుకుని తండ్రి మాటను లెక్క చేయకుండా 'కాంతార' తెగను ఊచకోత కోస్తూ వారిని బానిసలుగా చేయాలని చూస్తాడు. దీన్ని చూసిన బెర్మె యువ రాజు నుంచి తన తెగ వారిని కాపాడేందుకు సిద్ధమవుతాడు. రాజును ఎదిరించి మరీ సొంతంగా సుగంధ ద్రవ్యాలతో వ్యాపారం చేస్తాడు బెర్మె. మరోవైపు, రాజశేఖరుని కుమార్తె కనకవతి (రుక్మిణి వసంత్) బెర్మెను ఇష్టపడుతుంది. దీంతో 'కాంతార' తెగపై కులశేఖరుడి పగ రెట్టింపవుతుంది. రాజు, అతని సైన్యం బారి నుంచి బెర్మె తన తెగ వారిని ఎలా కాపాడాడు? అతనికి దైవ గణాలు ఎలా సాయం చేశాయి? అసలు దైవిక భూమిలో దాగి ఉన్న రహస్యాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















