Chiranjeeva Series Release Date: రాజ్ తరుణ్ మైథలాజికల్ థ్రిల్లర్ 'చిరంజీవ' - టీజర్ వచ్చేసింది... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Chiranjeeva Series OTT Platform: యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ 'చిరంజీవ'. తాజాగా టీజర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Raj Tarun's Chiranjeeva Web Series OTT Release Date On Aha: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'చిరంజీవ'. జబర్దస్త్ ఫేం అభినయ కృష్ణ (అదిరే అభి) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, వీడియోస్ ఆకట్టుకుంటుండగా తాజాగా టీజర్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ సిరీస్‌లో రాజ్ తరుణ్ సరసన కుషిత కల్లపు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు శ్రీరంజని, అమిత్ భార్గవ్, నవీన్ సామ్సన్ కీలక పాత్రలు పోషించారు. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యంగా సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. టీజర్‌తో పాటే ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'చిరంజీవ మీటర్‌లో చాలా మేటర్ ఉంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
టీజర్ ఎలా ఉందంటే?
'ఆహా' కోసం ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగులో వస్తోన్న ఫస్ట్ సూపర్ హీరో వెబ్ సిరీస్ ఇదే. హీరోకు సూపర్ పవర్స్‌తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే ఎలా ఉంటుందో అనేదే ప్రధానాంశంగా 'చిరంజీవ' సిరీస్‌ను రూపొందించారు. శివ అనే రోల్‌లో రాజ్ తరుణ్ నటించారు. చిన్నప్పటి నుంచే ఎక్కడికైనా వేగంగా వెళ్లే అలవాటు ఉంటుంది శివకు. దీంతో తన చుట్టూ ఉన్న వారి సూచన మేరకు అంబులెన్స్ డ్రైవర్‌గా జాయిన్ అవుతాడు.
ఎదుటి వారి తలపై వారు ఎప్పుడు చనిపోతారో చూసే పవర్ అనుకోకుండా శివకు వస్తుంది. దీన్ని చూసిన శివ మొదట షాక్ అయినా... ఆ తర్వాత తనకు దేవుడు ఇచ్చిన వరం అని తెలుసుకుంటాడు. ఈ పవర్స్ వల్ల శివ ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వీటి వల్ల ఏం లాభం పొందాడు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
View this post on Instagram
Also Read: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్





















