Kannappa OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'కన్నప్ప' - వెయిటింగ్‌కు చెక్ పడిందిగా
Kannappa OTT Streaming: విష్ణు మంచు రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కన్నప్ప' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా... కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతోంది.

Vishnu Manchu's Kannappa OTT Streaming On Amazon Prime Video: విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ హిస్టారికల్ మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. విష్ణు కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
వెయిటింగ్‌కు చెక్ పెడుతూ...
నిజానికి బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతుందని తొలుత మూవీ టీం ప్రకటించింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ స్ట్రీమింగ్ కాలేదు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. మరోసారి మూవీ చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైందంటూ పోస్టులు పెట్టారు.
ఎట్టకేలకు 'అమెజాన్ ప్రైమ్'లో కన్నప్ప అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 'గ్లోరీ గట్స్ గ్రాండియర్ అన్నీ ఒకే ఇతిహాసంలో...' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది సదరు ఓటీటీ సంస్థ. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మూవీని ఓటీటీలో చూసేయండి.
View this post on Instagram
Also Read: హీరోయిన్ వెయిట్‌లాస్ జర్నీ.. రోజూ గంట వ్యాయామం, ఆహారంలో కొద్ది మార్పులతో 35 కిలోలు తగ్గిందట
చాలా రోజుల తర్వాత విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఆయనకు మంచి బూస్ట్ లభించింది. తిన్నడి పాత్రలో విష్ణు అదరగొట్టారు. ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా... మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, రుద్రుడిగా ప్రభాస్, కిరాత పాత్రలో మోహన్ లాల్, శివునిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటే శివబాలాజీ, శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించారు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు రూ.100 కోట్లు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
స్టోరీ ఏంటంటే?
చిన్నప్పటి నుంచీ అడవిలో గూడెంలో పుట్టిన తిన్నడి (విష్ణు మంచు) తల్లి లేకపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) అన్నీ తానై పెంచుతాడు. ఓ సంఘటనతో తిన్నడికి దేవుడంటే పడదు. గూడెంలో ఉన్న ఆచారం ప్రకారం ఏ ఆపద రాకుండా ఉండాలంటే అమ్మోరికి ఎవరినో ఒకరిని బలివ్వాలి. అయితే, దీన్ని వ్యతిరేకించిన తిన్నడిని గూడెం నుంచి బహిష్కరిస్తారు. అతనికి అప్పటికే మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్) తిన్నడితో పాటు బయటకు వస్తుంది.
బయటకు వచ్చిన తిన్నడ ఓ ఘటనతో గొప్ప శివ భక్తుడిగా మారతాడు. అసలు ఆ ఘటన ఏంటి? గూడేలకు వచ్చిన ఆపద నుంచి తిన్నడు వారిని ఎలా రక్షించాడు? తిన్నడు భక్తుడిగా మారడంతో రుద్రుడి పాత్ర ఏంటి? వాయు లింగానికి కాపలా కాస్తున్న మహాదేవశాస్త్రి ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















