35 kg Weight Loss Transformation : హీరోయిన్ వెయిట్‌లాస్ జర్నీ.. రోజూ గంట వ్యాయామం, ఆహారంలో కొద్ది మార్పులతో 35 కిలోలు తగ్గిందట
Weight Loss : బరువు తగ్గేందుకు ఓ హీరోయిన్ వ్యాయామంతో పాటు డైట్లో కొన్ని మార్పులు చేసిందట. వాటితో పాటు లైఫ్స్టైల్లోని మార్పులతో 35 కిలోలు తగ్గిందట. ఆ హీరోయిన్ ఎవరో.. చూసేద్దాం.

Weight Loss Journey of Celebrity : బొద్దుగా ఉండే ఓ బాలీవుడ్ హీరోయిన్ వ్యాయామం చేస్తూ.. ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేస్తూ.. 35 కిలోలు తగ్గిందట. ఆమె ఎవరో కాదు భూమి పెడ్నేకర్(Bhumi Pednekar). బాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈమె సుపరిచితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే భూమి ఎలాంటి డైట్ ఫాలో (Bhumi Pednekar’s Weight Loss Journey) అవ్వకుండానే 35 కిలోలు తగ్గినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆరోగ్యకరమైన అలవాట్లు.. కాస్త ఓపికతో బరువు తగ్గినట్లు (Weight Loss) చెప్పింది.
5 ఏళ్ల క్రితం 2021లో, 'దమ్ లగాకే హైసా' చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. అయితే తన మొదటి సినిమా సమయంలో భూమి పెడ్నేకర్ బాగా లావుగా ఉండేది. ఆ సయమంలో స్క్రీన్‌పై తనని తాను చూసుకున్నప్పుడు బాగా లావుగా ఉన్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత ఎలా అయినా బరువు తగ్గాలని అనుకున్నట్లు తెలిపింది. అప్పటినుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా 35 కిలోల బరువు తగ్గానని తెలిపింది. 
భూమి బరువు ఎలా తగ్గిందంటే..
భూమి బరువు తగ్గడం కోసం వ్యాయామం మొదలుపెట్టింది. పిలేట్స్, రన్నింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేయడం ప్రారంభించింది. తన రోజును రన్నింగ్‌తో ప్రారంభించేదట. ఆ తర్వాత నట్స్, పండ్లతో కూడిన పోషకాహారం (Diet Secrets of Bhumi Pednekar) తీసుకునేదట. అనంతరం గంట వ్యాయామం చేసేదానిని అని తెలిపింది భూమి. తనను తాను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు రోజుకు 7 వేల నుంచి 8 వేల అడుగులు నడిచేదట.
'ఒక సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగిన తర్వాత, నేను 35 కిలోలకు పైగా బరువు తగ్గాను. అప్పటి నుంచి క్రమంగా టైమ్ టూ టైమ్ అన్ని జరిగేలా చూసుకుంటాను. అలా అని క్రేవింగ్స్తో ఆగిపోలేదు. కానీ నిజంగా చాలా కష్టపడ్డాను. రిజల్ట్స్ రావడం ప్రారంభమయ్యాక నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పిలేట్స్, రన్నింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, రెగ్యులర్ రన్నింగ్, తేలికపాటి వ్యాయామాలతో(Workout Routine of Bhumi Pednekar) పాటు సమతుల్య ఆహారాన్ని రొటీన్లో భాగం చేశాను. ఇది నన్ను యాక్టివ్‌గా ఉంచుతుంది' అని తెలిపింది భూమి.

ఉదయం జిమ్ చేయడం కుదరకుంటే సాయంత్రం జిమ్ చేసేదట. అలాగే మొత్తం శాఖాహారమే తీసుకునేదట. తినే ఆహారంపై కచ్చితంగా శ్రద్ధ వహించేదట. వెజ్ తన జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చిందని తెలిపింది. కాబట్టి ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామో.. ఎంత తీసుకుంటున్నామో కచ్చితంగా తెలుసుకోవాలని చెప్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో కూర్చొని బాధపడితే ప్రయోజనాలు ఉండవని.. బయటకొచ్చి కొన్ని చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తోంది ఈ బ్యూటీ.






















