బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతాయి. షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసి.. జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో నిండిన వాల్ నట్స్ ఆకలిని నియంత్రించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో, అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
పిస్తా పప్పులు ఫైబర్, పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి అతిగా తినడాన్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి. హెల్తీ స్నాక్‌కి బెస్ట్ ఆప్షన్.
పీచుతో నిండిన అత్తి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కేలరీల తీసుకోవడం తగ్గిస్తూనే సంతృప్తిగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
ప్రూన్స్ ఆరోగ్యకరమైన రీతిలో స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. వాపును తగ్గించడానికి, మంచి జీర్ణశక్తికి హెల్ప్ చేస్తాయి.
ఖర్జూరాలు సహజంగా తీపిగా ఉంటాయి. పీచు పదార్థాలతో నిండి ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి.. ఎనర్జీని అందిస్తాయి. ఇవి షుగర్ స్నాక్స్‌కు మంచి ఆల్ట్రనేటివ్గా హెల్ప్ చేస్తాయి.
ఎండుద్రాక్షల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. అధిక ఆకలిని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తాయి.
జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. కోరికలను అదుపులో ఉంచుతుంది. ఎనర్జీని ఇచ్చి జీవక్రియను పెంచుతుంది.