Bharateeyudu 2 OTT Release Date: అఫీషియల్‌గా 'భారతీయుడు 2' ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
Indian 2 OTT Release Date Netflix: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Netflix announced the OTT release date of Indian 2 movie: లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఇండియన్ 2'. శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. తెలుగులో 'భారతీయుడు 2' (Bharateeyudu 2)గా, హిందీలో 'హిందుస్తానీ 2' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ నెలల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఇంటర్నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇవాళ ఆ డేట్ అనౌన్స్ చేసింది.
ఆగస్టు 9న ప్రీమియర్... స్ట్రీమింగ్ షురూ!
Indian 2 Streaming From Aug 9th On Netflix: ఈ నెల (ఆగస్టు) 9వ తేదీ నుంచి 'ఇండియన్ 2' సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని భాషల్లో అనువదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
'ఇండియన్ 2' కథ విషయానికి వస్తే.... దేశంలో జరుగుతున్న అవినీతిని సహించలేని కొందరు యువతీ యువకులు సోషల్ మీడియాలో 'కమ్ బ్యాక్ ఇండియన్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తారు. అది చూసిన సేనాపతి (కమల్ హాసన్) ఇండియాకు తిరిగి వస్తాడు. ఆ తర్వాత అవినీతి పరులను పైలోకాలకు పంపించడం మొదలు పెడతాడు. మరోవైపు అతడు ఇచ్చిన పిలుపు వల్ల కొందరు తమ తల్లిదండ్రులు చేసిన అవినీతిని బయట పెడతారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల 'గో బ్యాక్ ఇండియన్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అప్పుడు ఏమైంది? అనేది మిగతా సినిమా.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?
#Indian2 Streaming From Aug 9th On #Netflix pic.twitter.com/MnjZQsr5TW
— Suresh PRO (@SureshPRO_) August 3, 2024
థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన!
Indian 2 movie box office reception: 'భారతీయుడు' (ఒరిజినల్ తమిళ్ వెర్షన్ 'ఇండియన్') 28 ఏళ్ల క్రితం విడుదల అయ్యింది. ఆ సినిమా కల్ట్ క్లాసిక్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఆ మూవీతో కంపేర్ చేస్తే... 'భారతీయుడు 2'కు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. థియేటర్లలో భారీ వసూళ్లు సైతం రాలేదు. మరి, ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీలో ఎటువంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో 'ఇండియన్ 2'ను తెరకెక్కించింది. విడుదలకు ముందు సీక్వెల్ సైతం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది (2025లో) ఆ సినిమా విడుదల చేస్తామని చెప్పింది. 'భారతీయుడు 2'లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. 'భారతీయుడు 3'లో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కనిపించనుంది. కీలక పాత్రలో ఎస్.జె. సూర్య సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.
Also Read బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

