News
News
వీడియోలు ఆటలు
X

ఓటీటీలోకి సుధీర్ ‘హంట్’ మూవీ - మరీ ఇంత త్వరగానా!

థియేటర్స్ కు వచ్చిన రెండు వారాలకే హంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

FOLLOW US: 
Share:

హీరో సుధీర్ బాబు లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హంట్’. తాజాగా విడుదల అయిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలు పోషించారు. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ‘హంట్’ మూవీకి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. ‘గన్స్ డోంట్ లై’ అనే ఉపశీర్షికతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వీ.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  

మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ, మంజులా ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ తదితరులు ఈ సినిమాలో నటించారు. అంతేకాదు హాలీవుడ్ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ లు హంట్ మూవీలో స్టంట్స్ కంపోజ్ చేశారు. ఎక్కువగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే అభిమానులకు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చుతుంది. సుమారు 10 సంవత్సరాల క్రితం మలయాళంలో వచ్చిన ‘ముంబై పోలీస్’ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రీమేక్ అన్నట్లు ముందుగా ఏ ప్రచారం చేయలేదు. కానీ ముంబై పోలీస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ‘హంట్’ రీమేక్ మూవీ అని ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు థియేటర్స్ కు వచ్చిన రెండు వారాలకే ‘హంట్’ మూవీ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉండటం గమనార్హం.

‘హాంట్’ చిత్రంలో సుధీర్ బాబు డిఫరెంట్ రోల్ చేశారు. స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారట. సుధీర్ బాబు అటువంటి డిఫరెంట్ రోల్ చేయడం చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ తాను ఇక రెగ్యులర్ చిత్రాలు చేయనని తెలిపారు. అంతేకాదు సినిమా విడుదల చేసేందుకు ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తిగా ఉందని చెప్పారు. ఏదీ ఏమైనా సుధీర్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నా అడియాసలు అయ్యాయని చెప్పుకోవచ్చు.

సంక్రాంతికి విడుదలైన పెద్ద హీరోల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డిలు బాగా రాణించడంతో ‘హంట్’కు ఆదరణ తగ్గింది. విడుదలకు ముందు ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ చేశారు. సుధీర్ బాబు కూడా తన సినీ కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని భావించారు. కానీ అనుకున్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా శుక్రవారం (10.02.2023) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. అదేవిధంగా ‘ఆహా’లో సైతం ప్రసారం కానుందని సమాచారం. థియేటర్స్ లో అంచనాలను అందుకోలేక పోయిన ‘హంట్’ మూవీ ఓటీటీలో ఎంతవరకు అలరించనుందో వేచి చూడాల్సిందే.

Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్! 

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Published at : 09 Feb 2023 08:16 PM (IST) Tags: OTT Movies Telugu Movie Hunt Movie upcoming Hunt in OTT

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ - నేటి సినీ విశేషాలివే!

‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ - నేటి సినీ విశేషాలివే!

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

నేరుగా ఓటీటీలోకి విజయ్ సేతుపతి ఫస్ట్ బాలీవుడ్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు!

నేరుగా ఓటీటీలోకి విజయ్ సేతుపతి ఫస్ట్ బాలీవుడ్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!