Ghatikachalam OTT Streaming: సడన్‌గా ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ 'ఘటికాచలం' - ఒకేసారి రెండు చోట్ల స్ట్రీమింగ్
Ghatikachalam OTT Platform: లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ఘటికాచలం' సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది.

Nikhil Devadula's Ghatikachalam OTT Streaming On Aha Amazon Prime: హారర్, క్రైమ్, థ్రిల్లర్స్ అంటేనే మూవీ లవర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్. అలాంటి కంటెంట్‌నే ఓటీటీలు ప్రస్తుతం ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. మరో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
రెండు ఓటీటీల్లోకి 'ఘటికాచలం'
యంగ్ హీరో నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ఘటికాచలం'. మే 31న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీలు 'అమెజాన్ ప్రైమ్', 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్ దేవాదుల, ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎం.సి.రాజు స్టోరీ అందించగా.. ఫేవియో మ్యూజిక్ అందించారు.
Also Read: ఆడపులి పేరు 'క్లీంకార' - జూ పార్కుకు ఉపాసన థాంక్స్.. మెగా గారాల పట్టి బర్త్ డే స్పెషల్..
స్టోరీ ఏంటంటే?
తనకు ఇష్టం లేని కోర్స్ చదువుతున్న ఓ యువకుడి మానసిక సంఘర్షణే బ్యాక్ డ్రాప్‌గా 'ఘటికాచలం' మూవీ తెరకెక్కింది. కౌశిక్ (నిఖిల్ దేవాదుల) తనకు ఇష్టం లేకున్నా తండ్రి (ప్రభాకర్) కోసం డాక్టర్ కోర్స్ చేస్తుంటాడు. చాలా ఇంట్రోవర్ట్‌గా ఉంటూ ఎవరితోనూ ఎక్కువగా కలవలేడు. కాలేజీలో తన తోటి విద్యార్థిని సంయుక్తని లవ్ చేస్తాడు. అయితే, ఆ విషయం ఆమెకు చెప్పలేడు. ఇష్టంలేని చదువు ఓ వైపు.. ఇష్టపడిన అమ్మాయికి ఆ విషయం చెప్పలేక మరోవైపు సతమతమవుతుంటాడు.
కొన్ని రోజులకి కౌశిక్‌కు ఓ భయంకర వాయిస్ వినిపిస్తుంది. దీంతో బాగా డిస్టర్బ్ అవుతాడు. అతని పరిస్థితి చూసిన తల్లిదండ్రులు డాక్టర్, బాబాల వద్దకు తీసుకెళ్తారు. సైకలాజికల్ సమస్య అంటూ డాక్టర్స్ చెప్పగా.. దెయ్యం అంటూ మంత్రగాళ్లు చెబుతారు. అయితే.. కౌశిక్‌తో మాట్లాడుతుంది కొద్ది రోజుల క్రితం చనిపోయిన ఘటికాచలం అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? నిజంగా కౌశిక్‌కు వినిపిస్తుంది దెయ్యం వాయిస్‌నా? లేక సైకలాజికల్ ప్రాబ్లమా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















