(Source: Poll of Polls)
Samantha: ఆ వార్తలన్నీ ఫేక్ - టాటూ అలాగే ఉందిగా.. సమంత లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Samantha Ruth Prabhu: సమంత 'వైఎంసీ' తొలగించారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె లేటెస్ట్ ఫోటోస్‌లో ఆ టాటూ అలానే ఉండగా.. వైరల్ అవుతున్నాయి.

YMC Tattoo On Samantha Neck: స్టార్ హీరోయిన్ సమంత తనకు ఎంతో స్పెషల్ అయిన 'వైఎంసీ' టాటూను తొలగించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె లేటెస్ట్ ఫోటోల్లో ఆ టాటూ అలానే ఉంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
నాగచైతన్యతో డివోర్స్ తర్వాత సమంత ఆయన గుర్తులు ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తున్నారు. 'సీక్రెట్ ఆల్కమిస్ట్' బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల సమంత ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. 'నథింగ్ టు హైడ్' అని రాశారు. దీనికి 'ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది' అనే క్యాప్షన్ ఇవ్వగా వైరల్ అయ్యింది. అయితే.. ఆమె మెడపై ఎప్పుడూ ఉండే 'వైఎంసీ' (ఏ మాయ చేశావే) టాటూ లేకపోవడాన్ని గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలుపెట్టారు. అఖిల్ పెళ్లి టైంలోనే ఇలా చై చివరి గుర్తులు చెరిపేశారంటూ కామెంట్స్ చేశారు.
ఆ టాటూ తీసేయలేదు
ఇటీవలే సమంత ముంబైలోని తన జిమ్‌లో నుంచి బయటకు వస్తుండగా.. ఫోటోగ్రాఫర్లు ఆమె చుట్టుముట్టారు. ఫోన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా.. 'గుడ్ మార్నింగ్ సమంత మేడం' అంటూ ఫోటోస్ తీయడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సమంత.. 'స్టాప్ ఇట్ గాయ్స్' అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు ఎక్కి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోస్ వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల ఇష్టాయిస్టాలు పట్టించుకోకుండా ఇలా ఫోటోలు తీయడం సరి కాదంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఈ ఫోటోల్లో సమంత మెడపై 'వైఎంసీ' టాటూ అలానే ఉంది. దీంతో ఆ వీడియో కోసమే ఆ టాటూను ఆమె కవర్ చేశారంటూ.. ఆ పచ్చబొట్టు చెరిపేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆడపులి పేరు 'క్లీంకార' - జూ పార్కుకు ఉపాసన థాంక్స్.. మెగా గారాల పట్టి బర్త్ డే స్పెషల్..
టాటూ ఎందుకంత స్పెషల్?
సమంత తన ఫస్ట్ మూవీ 'ఏ మాయ చేశావే'తోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మూవీని తెరకెక్కించగా.. నాగచైతన్య హీరోగా నటించారు. ఇద్దరి కెరీర్‌లోనూ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తొలి సినిమా విజయం సాధించడంతో సమంత దానికి గుర్తుగా 'వైఎంసీ' అనే టాటూ వేయించుకున్నారు. ఇది తనకెంతో ప్రత్యేకం అంటూ ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.
అటు.. నాగచైతన్యతో లవ్ టైంలో ఆమె పలు టాటూస్ వేయించుకున్నారు. 2021లో వీరిద్దరి డివోర్స్ తర్వాత ఆమె చై జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆ టాటూ కూడా తొలగించారనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ ఫోటోస్‌లో ఆ పచ్చ బొట్టు అలానే ఉండడంతో దీనిపైనా సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సమంత 'శుభం' మూవీని నిర్మించారు. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్ కోసం వర్క్ చేస్తుండగా.. 'మా ఇంటి బంగారం' మూవీలోనూ నటించనున్నారు.





















