EXAM Web Series OTT : ఈ EXAM రాసేది కాదు - ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
EXAM Series OTT Platform : సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ EXAM ఓటీటీలోకి వచ్చేస్తోంది. తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

Dushara Vijayan's EXAM Web Series OTT Release Date Locked : EXAM... ఓ విద్యార్థి తలరాతను మార్చేది. ఓ నిరుద్యోగి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది. అలాంటి EXAMలో అవినీతి, స్కామ్, పేపర్ లీక్స్ వంటివి చొరబడితే ఏం జరుగుతుంది? ఓ తరం ఫ్యూచరే ప్రమాదంలో పడుతుంది. ఇదే కాన్సెప్ట్ ప్రధానాంశంగా రాబోతోంది ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. టైటిల్ కూడా EXAM.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
EXAM సిరీస్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'పరీక్ష మీ భవిష్యత్తును నిర్ణయించినప్పుడు, ఆ పరీక్షను ఎవరు నిర్ణయిస్తారు?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.
View this post on Instagram
ఓటీటీలోకి అబ్బాస్ ఎంట్రీ
ఈ సిరీస్‌కు ఎ సర్కుణం దర్శకత్వం వహించగా... దుషార విజయన్, అదితి బాలన్, అబ్బాస్, నరేన్ మణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా రూపొందించారు. అబ్బాస్‌కు ఇదే ఓటీటీ ఎంట్రీ. ప్రేమదేశంతో అప్పట్లో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆయన... చాలా రోజుల గ్యాప్ తర్వాత రీసెంట్‌గా తమిళ మూవీ హ్యాపీ రాజ్‌లో నటించారు. ఇప్పుడు సరికొత్త సిరీస్‌లో నటిస్తున్నారు.
ఇక తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి గతంలో విక్రమ్ వేద మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2017లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్స్‌గా నటించారు. ఆ తర్వాత పలు మూవీస్‌తో పాటు ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'సుడుల్' వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.
Also Read : ఆచార్య దేవా నేను వచ్చేశా - కల్కి 2898AD సీక్వెల్ టైటిల్ ఫిక్స్ చేశారా!... క్లైమాక్స్‌లో బిగ్ సర్‌ప్రైజ్
EXAM స్టోరీ ఏంటంటే?
ప్రస్తుతం విద్యా రంగం, వ్యవస్థలో లోపాలు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిర్వహణ వంటి అంశాలే ప్రధానంగా 'EXAM' సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓ యువతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో జరిగే స్కామ్స్, పేపర్ లీక్ ముఠాను బయట పెట్టేందుకు ఏం చేసింది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, అవినీతిని ఎలా అంతమొందించింది? పేపర్ లీక్స్‌ను ఎలా అరికట్టింది? అనేదే స్టోరీ అని తెలుస్తోంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























