Dude OTT: 'ప్రేమలు' మమితా బైజుతో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్
Dude OTT Platform: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న సినిమా 'డ్యూడ్'. మమితా బైజు హీరోయిన్. వాళ్లిద్దరూ జంటగా ఉన్న లుక్ రిలీజ్ చేశారు. ఇంకో అప్డేట్ ఏమిటంటే... సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయ్యింది.

ప్రదీప్ రంగనాథన్... దర్శకుడిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. రవి మోహన్ ('జయం' రవి) హీరోగా 'కోమాలి' తీశారు. ఆ తర్వాత స్వీయ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా 'లవ్ టుడే'తో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో రెండు భాషల్లోనూ పాపులరిటీ సాధించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'డ్యూడ్'.
డ్యూడ్... ఓటీటీ రైట్స్ అమ్మేశారు!
Pradeep Ranganathan's Dude locks its OTT Partner: ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫస్ట్ లుక్ రిలీజ్ కంటే ముందు సినిమా ఓటీటీ రైట్స్ అమ్మేశారు.
'డ్యూడ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని టాక్.
'ప్రేమలు' మమితా బైజుతో 'డ్యూడ్'
'డ్యూడ్'ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ బైలింగ్వల్ సినిమాతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ డబ్బింగ్ సినిమా 'ప్రేమలు'తో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన మమిత బైజు ఇందులో హీరోయిన్. సెకండ్ లుక్ కింద హీరో హీరోయిన్లు జంటగా ఉన్న స్టిల్ విడుదల చేశారు. 'డ్యూడ్' సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
Also Read: బికినీలో రమ్య పసుపులేటి... థాయ్‌లాండ్‌లో తెలుగమ్మాయ్ షికార్లు చూశారా?
View this post on Instagram
దీపావళికి థియేటర్లలో 'డ్యూడ్' రిలీజ్!
Dude Movie Release Update: యువతను ఆకట్టుకునే విధంగా 'డ్యూడ్' సినిమాను రూపొందిస్తున్నట్టు ఆల్రెడీ విడుదల చేసిన లుక్స్ చూస్తే అర్థం అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే... ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్, ఇంకా ముఖం మీద గాయాలు, చేతిలో మంగళ సూత్రంతో కనిపించారు. ఈ ఏడాది దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నారు.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర తారాగణం. 'డ్యూడ్' చిత్రానికి సంగీతం: సాయి అభ్యాంకర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, ఎడిటర్: భరత్ విక్రమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని - వై రవిశంకర్, రచన - దర్శకత్వం: కీర్తిశ్వరన్.





















