Bhamakalapam 2 Glimpse: డేంజరస్ హౌజ్‌వైఫ్ వచ్చేస్తోంది - ‘భామా కలాపం 2’ గ్లింప్స్ చూశారా?
Bhamakalapam 2 Glimpse: ప్రియమణి లీడ్ రోల్‌లో చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘భామా కలాపం 2’కు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో శరణ్య ప్రదీప్ కామెడీ హైలెట్‌గా నిలిచింది.
Bhamakalapam 2 Glimpse Out Now: ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు లేడీ ఓరియెంట్ కథలతో కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఆ తర్వాత తను నటించిన సినిమాల నుండి ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలారోజుల తర్వాత ‘భామా కలాపం’ అనే ఓటీటీ కంటెంట్‌లో లీడ్‌గా నటించి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ‘భామా కలాపం’.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో విడుదలయినా.. ఇప్పుడు దీని సీక్వెల్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలయ్యింది. ‘భామా కలాపం 2’లో లీడ్ రోల్స్ చేసిన ప్రియమణి, శరణ్య ప్రదీప్‌లను ఈ గ్లింప్స్‌లో హైలెట్ చేసి చూపించారు.
ఇంట్రెస్టింగ్ గ్లింప్స్..
2022లో ఆహాలో నేరుగా విడుదలయిన సినిమా ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియమణి లీడ్ రోల్‌లో నటించింది. మంచి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ప్రశంసలే అందుకుంది. అనుపమ అనే క్యారెక్టర్‌లో ప్రియమణి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనతో పాటు శరణ్య ప్రదీప్ కూడా ముఖ్య పాత్రలో కనిపించింది. కామెడీ విలన్‌గా జాన్ విజయ్ నవ్వించారు. ఆహాలో విడుదలయిన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో దీనికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.
గ్లింప్స్‌లో ఆ ఇద్దరు..
శరణ్య ప్రదీప్ చెప్తున్న డైలాగ్‌తో ‘భామా కలాపం 2’ గ్లింప్స్ మొదలవుతుంది. శరణ్య చెప్పిన ప్లాన్‌కు భయమేస్తుందని ప్రియమణి రిప్లై ఇవ్వగా.. మొదటి భాగంలో ఏం జరిగిందో గుర్తుచేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత ప్రియమణికి డేంజరస్ హౌజ్‌వైఫ్ అని ట్యాగ్ ఇచ్చింది. ఈ గ్లింప్స్‌లో ‘భామా కలాపం’ మొదటి భాగం గురించి కూడా గుర్తుచేశారు. ఇక మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడ నుంచే ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ‘భామా కలాపం 2’ కూడా పూర్తిస్థాయి కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని క్లారిటీ వచ్చేస్తోంది. ఈ ‘మోస్ట్ డేంజరస్ హౌజ్‌వైఫ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ‘భామా కలాపం 2’ రిలీజ్ గురించి రివీల్ చేశారు మేకర్స్.
మ్యూజిక్ డైరెక్టర్ మారాడు..
‘భామా కలాపం’కు మార్క్ కే రాబిన్ సంగీతాన్ని అందించగా.. సీక్వెల్‌కు మాత్రం ప్రశాంత్ విహారీని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు మేకర్స్. సీక్వెల్‌కు కూడా అభిమాన్యు తాడిమేటినే దర్శకత్వం వహించాడు. బాపినీడు బీ, సుధీర్ ఎదార.. ‘భామా కలపాం 2’కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాడు. ‘రుచికరమైన హెయిస్ట్ ఫీస్ట్’ అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. మరోసారి ప్రియమణిని అనుపమ పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుందని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆ క్లబ్‌లో జాయిన్ అవ్వనున్న 8వ హీరోగా తేజ సజ్జా రికార్డ్ - ‘హనుమాన్’ వల్లే!