Akhil Agent OTT: అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Akhil Agent Movie OTT Streaming Update: ఎట్టకేలకు అఖిల్ ఎజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్‌ను ఫైనల్ చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను సోనీ లివ్ ప్రకటించింది.
Agent Movie OTT Release and Streaming Details: ఎట్టకేలకు అఖిల్ 'ఏజెంట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏడాదిగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కన్‌ఫాం అయ్యింది. నిజానికి ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్. గతేడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఏజెంట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. నిఖిల్ కూడా తన బీస్ట్ మోడ్‌లోకి మారడానికి చాలా రోజులు జిమ్ కష్టపడ్డారు. అప్పట్లో అతడి లుక్ చూసి అంతా మూవీ హిట్ అనుకున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించని పరాజయం అందుకుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించారు. కానీ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. రిలీజ్‌క ముందు ప్రచార పోస్టర్స్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచాయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ఆడియన్స్‌ని ఎజెంట్ డిసప్పాయింట్ చేసింది.
అలా థియేటర్లో ఈ కథ, కథనం విషయంలో, యాక్షన్ సీక్వెన్స్‌లో టేకాఫ్ విషయంలో డైరెక్టర్ తడబాడ్డాడని, దాంతో అవి కథకు ఆప్ట్ కాలేదంటూ ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మూవీకి నెగిటివ్ రివ్యూస్ రావడంతో చాలా మంది సినిమను చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో చాలామంది ఈ మూవీ మిస్ అయ్యారు. ఇక ఓటీటీకి వస్తే చూద్దామని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి తరచూ నిరాశే ఎదురవుతుంది. ఇదిలా ఉంటే థియేటర్లో అట్టర్ ఫ్లాప్‌గ నిలిచిన అఖిల్ 'ఏజెంట్' మూవీ ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో అని అక్కినేని ఫ్యాన్స్ ఆశపడ్డారు. దీంతో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్న వారిని ఏజెంట్ నిరాశ పరుస్తూనే వస్తుంది.
Sony LIV deleted all the tweets related to #Agent.
— Movies4u Official (@Movies4u_Officl) July 9, 2024
Latest news is that Agent will be releasing on SONY LIV by mid July or end of July. pic.twitter.com/sbk3bz2hqr
ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందంటూ ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌పై కొన్ని నెలలుగా ఊరిస్తూనే ఉన్నారు. కానీ మూవీ విడుదలై ఏడాది దాటిన ఇప్పటికి ఓటీటీ రిలీజ్‌పై స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరిలో వస్తుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అది ప్రచారానికే పరిమితం అయ్యింది. మరోసారి డిజిటల్ ప్రియులు డిసప్పాయింట్ అయ్యారు. ఇక తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోనీ లివ్ కొత్త ప్రకటన ఇచ్చింది. ఎజెంట్ డిజాస్టర్ అయినా మంచి ధరకే ఏజెంట్ ఓటీటీ రైట్స్‌ని కొనగోలు చేసిందట సోనీ లివ్. ఎప్పుడో ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఇంతవరకు ప్రీమియర్‌కు ఇవ్వకపోవడం గమనార్హం. ఆ మధ్య ఓటీటీ రిలీజ్ ప్రకటించిన కొన్ని కారణాల వాయిదా పడింది. కానీ ఈసారి ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన అన్ని ట్వీట్స్ డిలిట్ కొత్తగా విడుదల తేదిని ప్రకటించింది సోనీ లివ్. ఈ సినిమాను సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్‌కి ఇవ్వనున్నట్టు సోనీ లివ్ ప్రకటించింది. మరి చూడాలి ఈ సారైనా ఈ చిత్రంగా విడుదలవుతుందా? లేదో చూడాలి!
Also Read: 'భారతీయుడు 2' ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్ - 4DXలోనూ రిలీజ్ కాబోతున్న మూవీ, ఇక ప్రేక్షకులకు కనుల పండుగే