Vishwak Sen: ఓ ఆడపిల్లా... నువ్వు అర్థం కావా? విశ్వక్ సేన్ కొత్త సినిమాలో పాట విన్నారా?
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఇందులో కొత్త పాట విడుదలైంది. విన్నారా?
విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాట 'ఓ ఆడపిల్ల... నువ్వు అర్థం కావా?'ను బుధవారం విడుదల చేశారు.
'మాట రాని మాయావా... మాయ జేయు మాటవా?
మాటు లోని మల్లేవా... మల్లె మాటు ముల్లువా?
వయ్యారివా... కయ్యారివా... సింగారివా... సింగాళివా?' అంటూ తనకు తెలియని అమ్మాయి గురించి అబ్బాయి మదిలో ఊహలకు రూపం ఇస్తూ... అనంత శ్రీరామ్ ఈ పాట రాశారు. దీనికి జై క్రిష్ బాణీ సమకూర్చగా... రామ్ మిరియాల ఆలపించారు.
View this post on Instagram
మూడు పదుల వయసు వచ్చినా... పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పెళ్లి కాని అబ్బాయిల ఇబ్బందులు ఏమిటి? అమ్మాయిల ఆలోచన ఏ విధంగా ఉందనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారట. 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తున్నారు.
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: ఆన్‌లైన్ టిక్కెట్ల జీవోపై హైకోర్టుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ !
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి