Chiranjeevi, Olympics : పీవీ సింధుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్.. ఒలింపిక్స్ కమిటీ రియాక్షన్ ఇదే
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధుకి భారతదేశం మొత్తం ప్రశంసలు కురిపించింది.
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్లో ఆయనొకరు. దాసరి నారాయణ రావు మరణం తరువాత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలన్నీ మరికొందరు పెద్దలతో కలిసి మెగాస్టార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మొన్నామధ్య కొందరు సెలబ్రిటీలు సైతం చిరు స్థాయి గురించి మాట్లాడారు. సామాజిక సేవలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్‌లు మొదలుపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడటంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చిరంజీవి రేంజ్ గురించి ట్విట్టర్‌లో చర్చలు సాగుతున్నారు. నిన్న జరిగిన ఒలింపిక్ గేమ్‌లో పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. చైనా క్రీడాకారిణి మీద విజయం సాధించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. అలా వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డులు సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధుకి భారతదేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అలానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ సెలబ్రిటీలు స్టార్ షట్లర్ సింధుకు అభినందనలు తెలియజేశారు. చిరంజీవి కూడా తనదైన స్టైల్ లో సింధుపై ప్రశంసలు కురిపించారు.
Also Read: Chiru Bobby Movie: 'డ్రైవింగ్ లైసెన్స్'ను కాపీ చేస్తున్నారా.. లేక రీమేకా.. బాబీ ఏమంటాడో..
''వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధుకి నా అభినందనలు. ఇంతవరకు ఇండియా గెలిచిన రెండు పతకాలు మన ఆడబిడ్డలే గెలవటం మన దేశంలోని స్త్రీ శక్తికి నిదర్శనం. No stopping Indian Women'' అంటూ సింధు, మీరాబాయిలకు సెల్యూట్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.
అయితే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా ఎంతమంది ట్వీట్లు వేసినా.. పట్టించుకోని ఒలింపిక్ ట్విట్టర్ హ్యాండిల్ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌కి మాత్రం బదులిచ్చింది. మెగాస్టార్ ట్వీట్‌కు బదులిస్తూ 'ఆమె ఎంతో స్ఫూర్తివంతురాలు' అంటూ పేర్కొంది. ఇది చూసిన మెగాభిమానులు చిరంజీవి రేంజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాను పూర్తి చేస్తున్న చిరంజీవి త్వరలోనే 'లూసిఫర్' రీమేక్‌ను మొదలుపెట్టనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు చాలా మంది కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.
Also Read : RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు