(Source: ECI/ABP News/ABP Majha)
Salaar OTT Streaming: 'సలార్' స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్‌లో ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది
Salaar digital streaming Netflix: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, 'సలార్' సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ఓ అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో సినిమాను చూడవచ్చు.
Prabhas Salaar OTT Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సలార్' మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో చూడాలని ఎదురు చూసే వీక్షకులకు, ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఓ అప్డేట్ ఇచ్చింది.
థియేటర్లలో విడుదలైన 28 రోజులకు...
Salaar OTT Release Date Netflix: జనవరి 20... అంటే ఈ శనివారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి రానుంది 'సలార్'. మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గత ఏడాది డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా 'సలార్'ను థియేటర్లలో విడుదల చేశారు. అయితే, థియేటర్లలో విడుదలైన 28 రోజులకు సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తెలియజేసింది.
Also Read: ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి - ఆ రోజు మొగల్తూరులో వేడుకలు, ఉచిత వైద్య శిబిరం
ప్రపంచవ్యాప్తంగా 'సలార్' సినిమా 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని మరీ కొన్ని ఏరియాల్లోని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎంతో కొంత షేర్ రాబడుతోంది. ఓటీటీలో విడుదలైన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతుంది.
ప్రభాస్ కటౌట్... ఫైట్స్.... సూపర్!
'సలార్' సినిమాకు విమర్శకుల నుంచి విపరీతమైన ప్రశంసలు రాలేదు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే... దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్‌ను వాడుకున్న విధానం ప్రేక్షకులకు నచ్చింది. ముఖ్యంగా అభిమానులను చాలా మెప్పించింది. ప్రభాస్ ఇమేజ్, ఫిజిక్ దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ కంపోజ్ చేశారు ప్రశాంత్ నీల్.
కోటెరమ్మ ఫైట్ అయితే థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అదొక్కటే కాదు... దానికి ముందు కోల్ మైన్స్ దగ్గర ఫైట్ గానీ, కోటెరమ్మ తర్వాత ఖాన్సార్ పెద్దల సమక్షంలో జరిగే ఫైట్ గానీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ముఖ్యంగా 'సలార్' ఎండింగ్ ట్విస్ట్ రెండో పార్ట్ మీద విపరీతమైన అంచనాలు పెంచింది. తాను తీసిన కన్నడ సినిమా 'ఉగ్రం' కథ తీసుకుని మరింత భారీ తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. కథ పాతదైనా ప్రభాస్ కటౌట్, ఆ టేకింగ్ కాసులు కురిపించింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్'ను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసింది. శృతి హాసన్ కథానాయికగా నటించిన 'సలార్'లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. ఇంకా ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.