By: ABP Desam | Updated at : 01 Nov 2021 01:30 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit/ Star Maa /Hotstar
కరోనా పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 5 ఉంటుందో లేదో అనుకున్నారు. లేటైనా లేటెస్ట్ గా వస్తున్నాం అంటూ ఎట్టకేలకు షో అట్టహాసంగా ప్రారంభించారు. హమ్మయ్య ఇక ఫుల్ ఎంటర్టైన్మెంటే అని ఫిక్సయ్యారు బుల్లితెర ప్రేక్షకులు. కానీ తొలిరోజే పెద్ద షాక్ తగిలింది. ఒక్కొక్కర్నీ హౌజ్ లో కి ప్రవేశపెడుతుంటే ఒక్కరైనా తెలిసిన వాళ్లుంటారేమో అని ఆశగా ఎదురుచూశారు. కానీ ఒక్క ముఖం కూడా తెలియదు. పోనీలే ఏదో అడ్జెస్ట్ అయి చూసేద్దాంలే అనుకుంటే రోజురోజుకీ పాత చింతకాయ పచ్చడే కనిపిస్తోంది కానీ కొత్తదనం అనే మాట ఎక్కడా లేదు. పైగా గడిచిన సీజన్లలో ఉన్నంత సందడి లేకపోగా గొడవలు, ఏడుపులు, అరుపులు రచ్చ రచ్చగా ఉంది. దీంతో కాస్త అప్ డేట్ అవవయ్యా బిగ్ బాస్ అంటున్నారు ప్రేక్షకులు.
Cream puyyi..Nominations lo veyyi..Evarevaru untaro chuddam!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/A7bPqeGN5O
— starmaa (@StarMaa) November 1, 2021
నామినేషన్లు అయితే ఎప్పటిలా సేమ్ టు సేమ్. ఫొటోలు మంటల్లో వేయడం, ఫ్రేములు పగులగొట్టడం, ముఖానికి రంగులు పూసుకోవడం, క్రీములు నింపిన ప్లేట్లతో ముఖంపై కొట్టడం , జోడీలను లోపలకకు పిలిచి ఎవరు నామినేట్ అవుతారో డిజైడ్ అవమని చెప్పడం, ఒక్కొక్కరినీ సీక్రెట్ గా పిలిచి నామినేట్ చేస్తున్న సభ్యుల పేర్లు చెప్పమనడం..ఇలా సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకూ సేమ్ టు సేమ్ ప్రాసెస్ నడిచింది. అంతో ఇంతో రెండు వారాల క్రితం ఇచ్చిన కోతి-చెట్టు-వేటగాడు నామినేషన్ టాస్క్ మినహా ఇప్పటి వరకూ కొత్తగా అనే మాటే లేదు. సీజన్ 4 ప్రోమో ఒకటి ఇక్కడ చూడొచ్చు.
Idi ra nominations ante 💥#Abijeet Mass🔥🔥
— Duuhh!! (@Slay_inn) November 1, 2021
Points matladithe edutodiki thadisipovali 💥🔥
Ee fire missing in this season.#Biggbosstelugu5 pic.twitter.com/RShFBhRMtX
బిగ్ బాస్ సీజన్ 5లో టాస్కులు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమేలేదు. అసలు టాస్కులుంటే కదా మాట్లాడుకోవడానికి అంటారా. అదీ నిజమే.. సోమవారం నామినేషన్లు, మంగళవారం నుంచి గురువారం వరకూ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్, కెప్టెన్సీ టాస్క్, వీకెండ్ లో హోస్ట్ నాగార్జున సందడి. ఇంతకు మించి టాస్కుల్లేవ్. పోనీ ఉన్న రెండు మూడు టాస్కులైనా సరదాగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఆగర్భ శత్రువుల్లా కొట్టుకుంటున్నారు హౌజ్ మేట్స్. దీంతో టాస్క్ అనే మాటవింటేనే రచ్చ షురూ అని ముందే ఫిక్సైపోతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. ఇక ఈ సీజన్ సీక్రెట్ రూం టాస్క్ కూడా ఫెయిల్. లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చిన తర్వాత మరింత డల్ అయిపోయాడు.
గత సీజన్లలో కనీసం లవ్ ట్రాక్స్ అయినా బావున్నాయని అనిపించాయి. పున్ను-రాహుల్ ట్రాక్ అయితే ఓ రేంజ్ లో పేలింది. ఈ సారి ప్రేక్షకులకు ఆ భాగ్యం కూడా లేదు. లహరి-మానస్ మొదట్లో క్లోజ్ గా కనిపించినా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. హమీదా-శ్రీరామ్ జోడీది కూడా ఇదే పరిస్థితి. లోబో-ఉమాదేవి ట్రాక్ మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించా ఆ తర్వాత వాళ్లిద్దరూ స్క్రీన్ పై కనిపిస్తేనే విస్కుకున్నారు ప్రేక్షకులు. ప్రియ క్యూట్ గా ఉందిలే అనుకుంటే ఆమెలో వైల్డ్ క్యారెక్టర్ బయటకు తీసుకురావడంతో ఇంటి నుంచి బయటకొచ్చేసింది. ప్రస్తుతం హౌజ్ లో అప్పుడప్పుడు షణ్ముక్ కి ముద్దులు పెట్టే సిరి, మాసన్ అంటే పడిచచ్చే ప్రియాంక తప్ప స్క్రీన్ కి కలర్ అద్దేవారే లేరు. ఇక యానీ మాస్టర్ ఎప్పుడెలా రియాక్టవుతుందో అర్థంకాదు.
ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తైపోయినా బిగ్ బాస్ ఇంటిసభ్యుల పేర్లు ఠక్కున ఓ ఐదు చెప్పండి అంటే ఆలోచనలో పడుతున్నామంటున్నారు ప్రేక్షకులు. వాస్తవానికి గడిచిన సీజన్లో కంటిస్టెంట్స్ కూడా హౌజ్ లోకి అడుగుపెట్టేవరకూ ఎవ్వరికీ తెలియదు. కానీ కొంతలో కొంత ఇంట్రెస్టింగ్ గా నడిచింది. కానీ సీజన్ 5 పై ఇప్పటికీ ఆసక్తి కలగడం లేదంటున్నారు. పైగా ఇంటి సభ్యులు మారినా వారిని ఆడించే తీరు మారకపోవడంతో మీరు చెప్పినట్టు 5 మచ్ కాదు బిగ్ బాస్... దిసీజ్ టూ మచ్ అంటున్నారు. ఇప్పటికైనా గత సీజన్లను ఫాలో కావడం మానేసి కాస్త కొత్తగా ఆలోచిస్తే మిగిలిన 50 రోజులైనా ఆసక్తిగా సాగుతుందేమో అంటున్నారు. బిగ్ బాస్ ఇది వింటున్నారా....!
Also Read: ముఖంపై క్రీములు కొట్టుకున్న బిగ్ బాస్ ఇంటిసభ్యులు... చైన్ బ్యాచ్ గొడవల్లా నామినేషన్లు.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులెవరంటే...!
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూప్పు తిప్పుకోలేని విజువల్ వండర్
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్
Also Read: నాని మాస్ సినిమాలో సమంతకు ఛాన్స్.. మరి ఒప్పుకుంటుందా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!
Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!