Bigg Boss 5 Telugu:ముఖంపై క్రీములు కొట్టుకున్న బిగ్ బాస్ ఇంటిసభ్యులు... చైన్ బ్యాచ్ గొడవల్లా నామినేషన్లు.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులెవరంటే...!
దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ తో ఇంటి సభ్యులందర్లో ఫుల్ జోష్ నింపిన బిగ్ బాస్..తెల్లారే సరికి నామినేషన్ల రూపంలో మంట పెట్టారు. ఈ వారం కూడా నామినేషన్లు గరంగరంగానే సాగాయ్...

ఆదివారం మొత్తం సందడిగా సాగే బిగ్ బాస్ ఎపిసోడ్ సోమవారం వచ్చే సరికి మళ్లీ రచ్చ మొదలైపోతుంది. నామినేషన్లలో భాగంగా ఈ వారం ''క్రీమ్ పూయి..నామినేషన్లో వేయి'' అన్న బిగ్ బాస్ ఆదేశాలమేరకు ప్లేట్స్ నిండుగా ఉన్న క్రీములు తీసి ముఖంపై కొట్టి మరీ నామినేషన్లు చేశారు. ఎప్పటిలా ఈ సోమవారం కూడా రచ్చ రచ్చ జరిగింది.
Cream puyyi..Nominations lo veyyi..Evarevaru untaro chuddam!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/A7bPqeGN5O
— starmaa (@StarMaa) November 1, 2021
ప్రతివారం ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్లిపోతారు నువ్వున్నా లేకపోయినా నాకేం పర్వాలేదంటూ మానస్..శ్రీరామచంద్ర ముఖంపై క్రీము కొట్టాడు. ఐదుగురు గ్రూప్ గా ఫాం అయ్యారని అన్న మానస్ మాటల్ని గుర్తుచేస్తూ ఎవరు వాళ్లని అడిగాడు రవి. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నీకెందుకు అని రివర్స్ లో క్వశ్చన్ చేశాడు మానస్. శ్రీరామ్ వంతు రాగానే కాలేజ్ చైన్ బ్యాచ్ ల గొడవల్లా ఉన్నాయని ఇది కరెక్ట్ కాదన్నాడు. మానస్ తన స్నేహితుడని సపోర్ట్ చేస్తా అంటూ సన్నీ ఇన్వాల్వ్ అయ్యాడు. మొత్తంగా చూస్తే గడిచిన వారాల కన్నా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మరింత గరంగరంగా సాగినట్టుంది.
ప్రోమో పరంగా చూస్తే ఈ వారం నామినేట్ అయిన సభ్యులు శ్రీరామ్, సన్నీ, మానస్ , కాజల్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏడు ఎలిమినేషన్స్ జరిగాయి. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, ప్రియ, లోబో హౌజౌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల్లో రవి, సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి, షణ్ముక్ తో పోలిస్తే ప్రియాంక, జెస్సీ, యానీ మాస్టర్ కాజల్ ఫాలోయింగ్ తక్కువే అనుకోవచ్చు. మరి పోటాపోటీగా సాగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు నామినేట్ అయ్యారో వెయిట్ అండ్ సీ.
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూప్పు తిప్పుకోలేని విజువల్ వండర్
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్
Also Read: నాని మాస్ సినిమాలో సమంతకు ఛాన్స్.. మరి ఒప్పుకుంటుందా..?
Also Read: హార్ట్ ఎటాక్ కాదు... నా దగ్గరకు వచ్చేసరికి పునీత్ పరిస్థితి ఇలా ఉంది... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















