అన్వేషించండి

Nithya Menen joins PSPK Rana: పవన్ సినిమాలో నిత్యామీనన్.. అధికార ప్రకటన వచ్చేసింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి జూలై 12నే సెట్స్ పైకి రావాల్సిన పవన్ కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా సెట్స్ లోకి నిత్యామీనన్ ఎంటర్ అయింది. 
 
ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో నిత్యామీనన్ చాలా సింపుల్ గా కనిపించింది. కథ ప్రకారం సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఆ పాత్రలో నిత్యామీనన్ తన బెస్ట్ ఇస్తుందని ముందే అంచనా వేయొచ్చు. 
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. 
 
ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. పవన్ గెటప్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget