News
News
X

Niharika tattoo: నిహారిక కొణిదెల టాటూ చూసారా? దాని అర్థం ఏంటో తెలుసా?

నాగబాబు ముద్దుల కూతురు నిహారిక టర్కీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బికినీలో కనిపించిన ఈ అమ్మడి ఒంటిపై, ఓ టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దాని అర్థం ఏంటని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

FOLLOW US: 

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇంట్లో అయినా, బయట అయినా ఓరేంజిలో సందడి చేస్తుంది. మెగా బ్రదర్స్ దగ్గర చాలా గారాబంగా కనిపిస్తుంటుంది. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబ నుంచి రావడంతో మోడ్రన్ గా పెరిగింది. ఈ ముద్దుగుమ్మకు సరదాగా షికార్లు చేయడం అంటే ఎక్కడలేని ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈమె టర్కీ విమానం ఎక్కింది. తన మిత్రులతో కలిసి వెకేషన్ ను హ్యాపీగా, జాలీగా గడుపుతోంది. బీచుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో బికినీలు వేసుకుని స్విమ్మింగ్ చేస్తోంది. టర్కీ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

నిహారిక టాటూ అర్థం ఇదేనా?

నిహారిక టర్కీ టూర్ ఎలా ఉన్నా.. ఆమె బికినీ వేసుకుని సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఫోటోలు కొన్ని నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. రేర్ గా బికినీ ధరించే నిహారిక ఫోటోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోల్లో నెటిజన్లను ఆకట్టుకున్న మరో విషయం ఉంది. అదే నిహారిక వీపు మీద ఉన్న టాటూ. ఈ టాటూను కాస్త తీక్షణంగా పరిశీలిస్తే  NK అనే లెటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ లెటర్స్ అర్థం ఏంటని నెటిజన్లు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. చివరకు NK అంటే నిహారిక కొణిదెల కావొచ్చని ఓ అంచనాకు వచ్చారు. ఆ అక్షరాలకు పక్కనే ఓ బర్డ్ ఎగురుతున్నట్లు కనిపిస్తున్నది. దాని పక్కన ఓ వింత డిజైన్ కనిపిస్తున్నది. దాని పూర్తి అర్థం ఎవరికీ తెలియకపోయినా.. NK అంటే నిహారిక కొణిదెల అనే కంక్లూజన్ కు వచ్చారు. వాస్తవానికి నిహారిక వీపు మీద ఉన్న టాటూ ‘సైరా’ సినిమా షూటింగ్ సమయంలోనే కనిపించింది. తాజాగా బికినీ వేసుకోవడంతో మరోసారి దర్శనం ఇచ్చింది.

View this post on Instagram
 
A post shared by Nihaa Konidela (@niharikakonidela)

News Reels

హీరోయిన్ గా ఆకట్టుకోకపోయినా, నిర్మాతగా రాణిస్తోంది!

ఇక నిహారిక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అందం, అభినయం ఉన్నా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరకగా నిహారిక, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై చైతన్యను వివాహం చేసుకుంది. అయితే, భర్తతో విభేదాలు వచ్చాయి, విడిపోతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, ఆ వార్తలను నిహారిక కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా మారింది. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నది. తాజాగా ఈమె నిర్మించిన ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఈతరం యూత్ ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Read Also: 11 భాషల్లో వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్', రిలీజ్ డేట్ ఫిక్స్

Published at : 10 Nov 2022 09:19 PM (IST) Tags: Niharika Konidela niharika konidela tattoo niharika konidela tattoo meaning

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి