By: ABP Desam | Updated at : 26 Feb 2023 07:45 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Rashmi Gautam/twitter
కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటన హైదరాబాద్ లో సెన్సేషనల్ అయ్యింది. వీధి కుక్కలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని కొందరు విమర్శిస్తుంటే, వీధి కుక్కలపై జరుగుతున్న ఘోరాలను ఎందుకు పట్టించుకోవడం లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేయర్ ఇంట్లో 5 వేల కుక్కులను విడిచి పెట్టాలంటూ కామెంట్ చేశారు. పెట్ లవర్ గా చెప్పుకునే రష్మి కుక్కలకు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రష్మిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, దానికి రెడీ అంటూ రష్మి సవాల్ విసిరింది. ''తప్పకుండా కొట్టొచ్చు. నేను వ్యక్తిగతంగా వస్తాను, నీ అడ్రస్ చెప్పు... ప్లీజ్! అప్పుడు చూద్దాం నువ్వు సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావో? ఇది ఓపెన్ ఛాలెంజ్'' అని రష్మీ ట్వీట్ చేసింది.
తాజాగా మరో నెటిజన్ ఆమెపై యాసిడ్ పోస్తానంటూ హెచ్చరించాడు. మైక్రోమ్యాక్స్ అనే ఓ అకౌంట్ నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. ఒకప్పుడు ఇదే వ్యక్తి “రష్మీ ముందుగా వెంటనే నువ్వు పెళ్లి చేసుకో 40 ఏళ్లు దాటుతున్నాయి. అందుకే, లేట్ చేయకుండా పెళ్లి చేసుకో” అంటూ గతేడాది సలహా ఇచ్చాడు. అదే వ్యక్తి తాజాగా తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. “నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దాన. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఆసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్ళకి తెలియదు. అన్ని మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు” అంటూ సదరు నెటిజన్ వార్నింగ్ ఇచ్చాడు.
తనకు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను రష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. “ఈ అకౌంట్ నుంచి కొంత కాలం క్రితం నా పెళ్లి, వయసు గురించి మెసేజ్ చేశారు. ఇప్పుడు నా మీద చేతబడి చేయిస్తానని, యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? వద్దా?” అని నెటిజన్స్ ను కోరింది. ఈ ట్వీట్‌కు కొందరు నెటిజన్లు లైట్ తీసుకో అని అంటుంటే, కొందరు మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే అంటూ రష్మికి సలహాలు ఇస్తున్నారు. మరి రష్మీ ఏం చేస్తుందో చూడాలి.
This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me
Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4— rashmi gautam (@rashmigautam27) February 25, 2023
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రష్మి, ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ప్రస్తుతం 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి యాంకర్ గా చేస్తోంది. టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.
Read Also: విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతన్య, సమంత మాత్రం?
Rohini Theatre Issue: రజనీ కాంత్ ఫ్యామిలీకి వర్తించని రూల్స్, వారికి ఎందుకు? ఆ థియేటర్ నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం
Manisha Koirala: ‘బొంబాయి’ సినిమా చేయకూడదు అనుకున్నాను, ఆయన వల్లే చేశా: మనీషా కొయిరాలా
Dasara Collections USA: అమెరికాలో ‘దసరా’ ధూమ్ ధామ్, తొలి రోజు బ్లాక్సాఫీస్ ద్గరగ కలెక్షన్ల సునామీ
NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ
Balagam - LACA Awards: లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో సత్తా చాటిన ‘బలగం‘, రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు
నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
COOKIES_POLICY