News
News
X

Naga Chaitanya: విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతన్య, సమంత మాత్రం?

సమంత-నాగ చైతన్య కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేశావే’. తాజాగా ఈ చిత్రానికి 13 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా సామ్, చై షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే, విడాకులు తర్వాత చై తొలిసారి సమంత ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ తను సామ్ ఫోటో చై ఎందుకు షేర్ చేశాడో ఇప్పడు తెలుసుకుందాం..

సామ్, చై తొలి సినిమా ‘ఏమాయ చేశావే’

సమంత-నాగచైతన్య కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేశావే’. గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో జెస్సీ అనే అమ్మాయి పాత్రలో నటించి సమంతా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్య ‘ఏమాయ చేశావే’ సినిమా కంటే ముందు ‘జోష్’ అనే సినిమాలో నటించాడు. అయితే, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘ఏమాయ చేశావే’ మూవీతోనే మంచి హిట్ అందుకున్నాడు.

ప్రేమ, పెళ్లి, విడాకులు

తెర మీద సామ్, చై జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సినిమాతో పాటు బయటకు కూడా ఈ జంట అందరికీ తెగ నచ్చింది. సినిమా సెట్ నుంచే వీరి స్నేహం మొదలయ్యింది. నెమ్మదిగా ప్రేమగా మారింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే, వీడి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు.

చైతన్య అలా.. సమంత ఇలా..

నాగ చైతన్యతో విడిపోయాక సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లోని చైతన్య ఫోటోలు అన్నింటినీ డెలీట్ చేసింది. అయితే, నాగా చైతన్య మాత్రం పాత ఫోటోలను అలాగే ఉంచాడు. విడాకుల తర్వాత తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చై షేర్ చేశాడు. ‘ఏమాయ చేశావే’ సినిమాకు ఇవాళ్టితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ మూవీలో సమంతతో దిగిన ఫోటోను చై ఇన్ స్టాలో షేర్ చేశాడు. ‘సెలబ్రేటింగ్ 13 ఇయర్’ అని క్యాప్షన్ పెట్టాడు. అటు సమంత కూడా ‘ఏమాయ చేశావే’కు 13 ఏండ్లు అంటూ ఆ సినిమాకు సంబంధించిన తన ఫోటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా నాగ చైతన్య ఫోటో లేకుండా జాగ్రత్త పడింది. ప్రస్తుతం వీరిద్దరు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  

Read Also: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్

Published at : 26 Feb 2023 04:51 PM (IST) Tags: Naga Chaitanya Samantha ye maya chesave movie

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !