Acharya: 'ఆచార్య' టాక్ - ఇలా ఉందేంటి?
'ఆచార్య' సినిమా మెగాభిమానులకు నచ్చుతుందని తెలుస్తోంది. కానీ జనరల్ ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోయిందట.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'ఆచార్య'. ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రే ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడడంతో టాక్ ముందుగానే బయటకొచ్చింది. అలానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ షోస్ చూసిన వాళ్లు సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఇందులో చాలా వరకు నెగెటివ్ ట్వీట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.
మెగాభిమానులకు ఈ సినిమా నచ్చుతుందని తెలుస్తోంది. కానీ జనరల్ ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోయిందట. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా ఎన్నో హిట్టు సినిమాలను తీసిన కొరటాల శివ.. మెగాస్టార్ కి మాత్రం డిజాస్టర్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. కొరటాల శివ నుంచి ఇలాంటి స్క్రిప్ట్ ఊహించలేదని.. స్టోరీ చాలా వీక్ గా ఉందని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉందని.. కాస్తో కూస్తో క్లైమాక్స్ ఒక్కటే కాస్త పర్వాలేదనిపిస్తుందని టాక్. కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకి నెగెటివ్ టాక్ దారుణంగా వస్తుంది. క్యాస్టింగ్ పరంగా కూడా సినిమా ఫెయిల్యూర్ అంటున్నారు. సినిమాలో విలన్ గా బెంగాలీ నటుడిని చూపించారు. కానీ అతడి గురించి ప్రీ ప్రమోషన్ అనేదే లేదు. రెజీనా ఐటెం సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని పెదవి విరుస్తున్నారు జనాలు.
ఇద్దరు మెగా హీరోలను పెట్టుకొని ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమా ఇస్తారా అంటూ కొరటాల శివపై మండిపడుతున్నారు. కనీసం ఎన్టీఆర్ సినిమా అయినా బాగా తీయాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా టాక్ ను బట్టి చూస్తుంటే 'ఆచార్య' సినిమా అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయిందనేది స్పష్టమవుతోంది. మొత్తానికి రాజమౌళి సెంటిమెంట్ ఈ సినిమా విషయంలో కూడా రిపీట్ అయినట్లే ఉంది. (రాజమౌళితో పని చేసిన హీరోల తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుంది. 'ఆర్ఆర్ఆర్'తో హిట్ కొట్టిన రామ్ చరణ్ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నాడు)
View this post on Instagram