అన్వేషించండి
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ - 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
![Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ - 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే? Mahesh Babu's Sarkaru Vaari Paata Trailer to be released on may 2nd Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ - 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/03ced9f5f2649bbaeef666bd5b5f78a7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కాసేపటి క్రితమే వచ్చింది. మే2న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతోన్న అవినీతి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read: పవన్ కోసం కథ రాశా - కొరటాల శివ కామెంట్స్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion