Micheal First Single: పాన్ ఇండియా పాట వచ్చేస్తుంది - సందీప్ కిషన్ ‘మైకేల్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
సందీప్ కిషన్ ‘మైకేల్’ సినిమా మొదటి పాట ‘నీవుంటే చాలు’ రిలీజ్ కానుంది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మైకేల్’ సినిమా నుంచి మొదటి పాట విడుదల కానుంది. ‘నీవుంటే చాలు’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ పాట రానుంది. ‘నీపోదుం ఎనక్కు’ అంటూ తమిళ పాట సాగనుంది.
ఈ పాట అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఒక రొమాంటిక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సందీప్ కిషన్‌తో పాటు హీరోయిన్ దివ్యాంశు కౌశిక్ కూడా ఈ పోస్టర్‌లో ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపిస్తున్నారు. గౌతమ్ మీనన్, అనసూయ, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలై పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో హీరో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి ఇలా ఒక్కో భాషలో ఒక్కో హీరో టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో సందీప్ కిషన్ లుక్స్ కూడా అదిరిపోయాయి. సందీప్ కిషన్ ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ లో చూపించారు.
టీజర్ లో సందీప్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలాగా అనిపిస్తుంది. విజువల్స్ లో కూడా కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ అయితే ఓ రేంజ్ లో ఉంది.
‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులిస్తూ "వెంటాడి ఆకలి తీర్చుకోడానికి... వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్" అని అంటాడు. అలాగే టీజర్ చివరలో ‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ "నేను మనిషిగానే ఉంటా మాస్టార్" అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచాయి.
View this post on Instagram