Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
నయనతార-విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, అగ్ర కథానాయిక నయనతార చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వాటిని విఘ్నేష్ శివన్ ఖండించారు.
తమకు చాలా సార్లు పెళ్లి చేశారని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సంగతి పక్కన పెడితే.. త్వరలో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల తిరుమలలోని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నయనతార, విఘ్నేష్ శివన్ దర్శించుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు వివాహ మండపాలను పరిశీలించారని వార్తలొచ్చాయి.
ఇప్పుడు వీరి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. జూన్ 9న పెళ్లి జరగనుందని తెలుస్తోంది. తమిళనాడులోని స్టార్ హోటల్ మహబ్స్ లో వీరి పెళ్లి జరగబోతుంది. ప్రముఖ వెడ్డింగ్ కంపెనీ.. షాదీ స్క్వాడ్ ఈ వివాహాన్ని జరిపించనున్నారు. ఇప్పటివరకు వీరు పేరున్న సెలబ్రిటీలకు పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు నయన్-విఘ్నేష్ మ్యారేజ్ కాంట్రాక్ట్ కూడా వీరికే దక్కింది.
Also Read: రాజమౌళి ఫ్యామిలీ చేసిన పనికి రామ్ అప్‌సెట్- అసలేం జరిగిందంటే?
Also Read: 'కేజీఎఫ్' బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?
View this post on Instagram
View this post on Instagram