By: ABP Desam | Updated at : 27 May 2022 01:23 PM (IST)
'కేజీఎఫ్' బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి 'కేజీఎఫ్' సినిమాతో పాపులర్ అయింది. ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు జనాలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు కానీ సెకండ్ పార్ట్ తో ఆమె ఇమేజ్ కాస్త పెరిగింది. దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటించాలనుకుంటుంది శ్రీనిధి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకి ఛాన్స్ లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారట.
దానికి కారణమేంటంటే.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే. నిజానికి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఇప్పుడు శ్రీనిధి కూడా అదే చేస్తుంది. రీసెంట్ గా ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెని సంప్రదించగా.. దాదాపుగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ప్రస్తుతం తెలుగులో పూజాహెగ్డే, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఆ రేంజ్ మొత్తాన్ని తీసుకుంటున్నారు.
అలాంటిది తెలుగులో ఇంకా ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయని శ్రీనిధి అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమా కూడా సైన్ చేయలేకపోయింది. ఈ విషయంలో శ్రీనిధి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోందట. మరి అంత పారితోషికం ఇచ్చి ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు ఎవరైనా దొరుకుతారేమో చూడాలి!
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Gruhalakshmi జులై 5 ఎపిసోడ్: విషం తాగబోయిన లాస్య, కరిగిపోయిన నందు, సంబరంలో తులసి
Karthika Deepam జులై 5 ఎపిసోడ్: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!
Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?
Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!
Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్
Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే
IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్దే - విజయానికి 119 పరుగులు!
Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే