Ram Pothineni: రాజమౌళి ఫ్యామిలీ చేసిన పనికి రామ్ అప్‌సెట్- అసలేం జరిగిందంటే?
యంగ్ హీరో రామ్.. 'ఉస్తాద్' టైటిల్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ టైటిల్ మరో హీరో వాడేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా అతడికి భారీ విజయాన్ని అందించడం పాటు.. 'ఉస్తాద్ రామ్' అనే పేరుని కూడా తీసుకొచ్చింది. దీంతో అప్పటినుంచి ఉస్తాద్ అనే టైటిల్ ను క్యారీ చేస్తున్నారు రామ్. తన ఫ్యూచర్ సినిమాల్లో ఒకదానికి ఈ టైటిల్ పెట్టాలనుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో పని చేయనున్న సినిమా ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు.
కానీ ఇప్పటివరకు టైటిల్ రిజిస్టర్ చేయించలేదు. ఇప్పుడు అదే టైటిల్ తో టాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అది కూడా రాజమౌళి ఫ్యామిలీకి చెందిన హీరో కావడం విశేషం. సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు శ్రీ సింహా. దీనికి 'ఉస్తాద్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో రామ్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి 'ఉస్తాద్' అనే టైటిల్ మరెవరూ రిజిస్టర్ చేయించరని అనుకున్నారు రామ్. అది తన నేమ్ టైటిల్ కాబట్టి ఇంకెవరూ తీసుకోరని భావించారు. కానీ రాజమౌళి ఫ్యామిలీకి చెందిన హీరో ఈ టైటిల్ ను వాడుకోవడం రామ్ తీసుకోలేకపోతున్నారట. ఈ విషయంలో చేసేదేం లేక సైలెంట్ గా ఉండిపోయినట్లు సమాచారం.
ప్రస్తుతం రామ్ 'ది వారియర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లింగుస్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
View this post on Instagram