Actor Naresh: పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లి? అసలు నిజం ఇది
(Actor Naresh) నటుడు నరేష్ నాలుగో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నరేష్ పిఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Actor Naresh and Pavithra Lokesh: నటుడు నరేష్ నాలుగో పెళ్లి తెలుగు సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. వారి పెళ్లి, బంధం నిజమో కాదో ఇంతవరకు తెలియరాలేదు. అయితే వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ తాజాగా నరేష్ పిఆర్ టీమ్ క్లారిటి ఇచ్చింది. నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటున్నారన్నది ఒట్టి పుకారేనని తేల్చి చెప్పింది. అయితే ఇంత హాట్ హాట్ గా పెళ్లి గురించి వార్తలు బయటికి వస్తున్నా పవిత్రా లోకేష్ మాత్రం స్పందించడం లేదు. వారిద్దరూ గత కొన్నేళ్లు సహజీవనం చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ఒకే ఇంట్లో నివసిస్తున్నారని, నరేష్ కుటుంబంతో అనేక వేడుకల్లో పవిత్రా కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం మహబలేశ్వరం వెళ్లారు, అక్కడ చాలా మంది వీరిద్దరినీ జంటగా చూశారు. పెళ్లికి ముందు ఆశీస్సులు తీసుకోవడానికే అక్కడికి వెళ్లారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ ఆలయం చరిత్రపై సినిమా తీస్తున్నారని అందుకే వెళ్లారని కూడా టాక్. ఏది నిజమో వారికే తెలియాలి. నరేష్ నిర్మిస్తున్న సినిమాల్లో పవిత్రా లోకేష్ ముఖ్య పాత్ర కూడా దక్కించుకుందట.
అతను సింగిలే, ఆమె మాత్రం....
నరేష్ కు ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు. పవిత్ర లోకేష్ కు 2007లో సుచేంద్ర అనే వ్యక్తితో పెళ్లయింది. వీరిద్దరూ కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. కానీ చట్టపరంగా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఆమె విడాకులు తీసుకుంటే కానీ వీరి పెళ్లికి రూట్ క్లియర్ అవ్వదు. అందుకే నరేష్, పవిత్ర రహస్య వివాహం చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
ఎన్నో సినిమాల్లో...
వీరిద్దరూ భార్యభర్తలుగా ఎన్నో సినిమాల్లో నటించారు. అందుకే వారి మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఏర్పడింది. హ్యాపీ వెడ్డింగ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంత మంచి వాడవురా, సరిలేరు నీకెవ్వరూ, లక్షి రావే మా ఇంటికి... వంటి సినిమాల్లో కలిసి నటించారు. పవిత్ర లోకేష్ కన్నడ, తెలుగు సినిమాల్లో అధికంగా నటించారు. తమిళంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఈమెకు భర్త సుచేంద్రతో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ఇష్టం లేకుండానే చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది.
Also read: పెళ్లి ఒక ఫెయిల్యూర్, నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతూ నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also read: నేను బిగ్‌స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను: జాన్ అబ్రహం