అన్వేషించండి

Chiru Perni Nani : చిరంజీవికి జగన్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివేనా ? పేర్ని నాని అలా తీసి పడేశారేంటి ?

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వెనుక టాలీవుడ్ సమస్యలపై చర్చించే ఎజెండా లేదని పేర్ని నాని తెలిపారు. ఆ సమావేశం పలకరింపుల కోసం మాత్రమేనన్నారు.

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌ సమావేశం అయ్యానని చిరంజీవి ప్రకటించారు. తాము ఏమేమీ మాట్లాడుకున్నామో వివరించారు. తాను చెప్పినవన్నీ సీఎం జగన్ రాసుకున్నారని.. వారం, పది రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పారని చిరంజీవి చెప్పారు. చిరు - జగన్ భేటీపై ఇద్దరికీ ఆప్తుడైన నాగార్జున సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. మంచి నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. కానీ శుక్రవారం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మొత్తం ఆశలపై నీళ్లు చల్లేశారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ.. సినీ పరిశ్రమ సంప్రదింపుల కోసం కాదని తేల్చేశారు. చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావని, కుశలప్రశ్నలు మాత్రమేనని ప్రకటించారు. వారిద్దరి మధ్య మాట్లాడుకున్నవన్నీ తమకు చెప్పలేదన్నారు. 

Also Read: చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?

ఓ ముఖ్యమంత్రి అధికారిక సమావేశం నిర్వహిస్తే దానికి సంబంధించి ప్రతి అంశాన్ని నమోదు చేసుకోవడానికి సిబ్బంది ఉంటారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పరు. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేర్ని నానికి సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ జరిగిందని సమాచారం లేదు. దీంతో ఆ సమావేశం ఉత్తుత్తిదేనా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేవలం పరామర్శల భేటీనేనని పేర్ని తన సొంతానికి ప్రకటన చేయరు. ఆయనకు ఈ అంశంపై స్పష్టమైన అవగాహన ఉండే చేసి ఉంటారని భావిస్తున్నారు.  

Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ తర్వాత రోజు రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరిగింది. చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అలాంటి ఆఫర్లు తనకు రావని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు బయట వారికి రాజ్యసభ స్థానం ఇవ్వాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ప్రకటించారు. ఇదంతా ఓ రాజకీయ వ్యూహం అన్న అభిప్రాయాలు వినిపించాయి. 

Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!

సినీ పరిశ్రమకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం కావాల్సిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది టిక్కెట్ రేట్లు. దేశంలో ఎలా ఉన్నాయో... ఏపీలోనూ అలాంటి రేట్లే నిర్ధారించాలని టాలీవుడ్ కోరుతోంది. దీనిపై హైకోర్టు సూచనలతో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఎప్పుడు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఎప్పుడనేదానిపై స్పష్టత లేదు. చివరికి చిరంజీవిని సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడినా ఏ మాత్రం అడుగు ముందుకు పడలేదని తేలిపోయింది. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget