అన్వేషించండి

Nani: పవన్ కళ్యాణ్ దర్శకుడితో నాని గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ!?

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా దర్శకుడితో నాని ఓ సినిమా చేయనున్నారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...

న్యాచురల్ స్టార్ నాని (Nani)లో మంచి నటుడు మాత్రమే కాదు... యాక్షన్ హీరో కూడా ఉన్నారు. అయితే... ఆయన నటించిన రొమాంటిక్ కామెడీ సినిమాలు ఎక్కువ శాతం విజయాలు సాధించడంతో ఆయనపై ఫీల్ గుడ్ మూవీస్ హీరో అని ముద్ర పడింది. అయితే... అది తప్పని, యాక్షన్ హీరోగానూ నాని విజయాలు సాధిస్తాడని 'దసరా' విజయం నిరూపించింది. ఇప్పుడు ఆయన మరో యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడితో నాని సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...

నానితో 'ఓజీ' దర్శకుడు సుజిత్ సినిమా!
పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌ స్టర్). దే కాల్ హిమ్ ఓజీ (అందరూ ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్‌ స్టర్ అంటారు)... అనేది ఉపశీర్షిక. ఆ చిత్రానికి 'రన్ రాజా రన్', 'సాహో' సినిమాల ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనతో నాని ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. 

మాఫియా నేపథ్యంలో నాని హీరోగా పాన్ ఇండియా సినిమా చేయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నారట. 'సాహో'తో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయ్యారాయన. ప్రజెంట్ చేస్తున్న 'ఓజీ' కూడా పాన్ ఇండియా ఫిల్మ్. మాఫియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. నానితో చేయబోయేది కూడా సేమ్ జానర్ ఫిల్మ్ అంట!

నాని సినిమాకూ 'ఓజీ' నిర్మాతే!
పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమాను డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని హీరోగా సుజిత్ చేయబోయే సినిమాను సైతం ఆయన ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. 'ఓజీ' కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందట.

Also Readదర్శకుడికి అవార్డు రాలేదు. కానీ, ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో దుమ్ము లేపిన 'యానిమల్'... భార్యాభర్తలు రణబీర్, అలియాతో పాటు ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూడండి!

'సరిపోదా శనివారం' తర్వాత మరో రెండు!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్నారు నాని. దాని తర్వాత ఆయన మరో రెండు సినిమాలకు 'యస్' చెప్పారు. తనకు 'దసరా' వంటి యాక్షన్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది కాకుండా 'బలగం'తో భారీ విజయం అందుకున్న వేణు టిల్లు (జబర్దస్త్ వేణు) దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పుడు సుజిత్ సినిమా లైనులోకి వచ్చింది. మరి, ఈ మూడు సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో? వెయిట్ అండ్ సి. ఇప్పుడు నాని మార్కెట్ పెరిగింది. తన ప్రతి సినిమానూ తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. బలంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకు సుజిత్ యాడ్ అయితే సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది. హిందీలో బాగా మార్కెట్ చేయవచ్చు.

Also Readపాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget