ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'
'దసరా' భారీ విజయం తర్వాత హీరో నాని తన నెక్స్ట్ ఫిల్మ్ 'నాని30' మూవీపై దృష్టి సారించాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ముంబై షెడ్యూల్ పూర్తయినట్లు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు
Nani 30 : నేచురల్ స్టార్ నాని ఇటీవల 'దసరా' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని తన 'Nani30' అనే టైటిల్‌తో తన తదుపరి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాకు సంబంధించిన ముంబై షెడ్యూల్ పూర్తయినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ప్రకటించారు. ముంబై నగరంలో షూటింగ్ జరుపుకుంటున్న తన తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదేనని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. దాంతో పాటు ఓ బ్యూటిఫుల్ పిక్ ను కూడా ఆమె షేర్ చేశారు.
'నాని 30'లో కియారా ఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ వీక్ సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ తర్వాత నాని ఓ థ్రిల్లర్ జోనర్ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. దీనికి ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జీతూ జోసెఫ్.. ఆ చిత్రాల తరహాలోనే నాని సినిమా కోసం ఆయన ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం.
ఇటీవల 'దసరా' సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన నాని.. ఈ సినిమాతో వంద కోట్ల హీరోగా మారాడు. ఏప్రిల్ 30న రిలీజైన ఈ మూవీ.. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తూ రికార్డు సృష్టించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో నిలిచింది. దీంతో ఈ సినిమాతో నానికి మంచి బ్రేక్ దొరికినట్టయింది. అంతే కాకుండా మాస్ ఆడియెన్స్‌లో యూనివర్సల్ యాక్సప్టెన్స్ దొరికింది.
Also Read : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్, సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నాని.. నేడు ఏ స్థానంలో ఉన్నాడో అందరికీ తెల్సిందే.‘అష్టాచమ్మా’ నుంచి ‘దసరా’ వరకు నాని సినీ జర్నీ ప్రతీ యంగ్ స్టర్ కి ఒక ఆదర్శం అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో నాని ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఆయన సినీ కెరీర్ లో హిట్స్ తో పాటుగా ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.