Nandamuri Mokshagna: స్టన్నింగ్ లుక్‌లో మోక్షజ్ఞ మెస్మరైజ్ - బాలయ్య ఫ్యాన్స్ ఫిదా
నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజాగా ఆయన ఓ ఫంక్షన్ లో తళుక్కున మెరిశాడు.
Nandamuri Mokshagna Recent Pic: నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడంటూ చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడంటూ గత కొద్ది సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన డెబ్యూ మూవీకి దర్శకత్వం వహించే డైరెక్టర్లు వీళ్లే అంటూ చాలా మంది పేర్లు హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మోక్షజ్ఞ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. డ్యాన్స్ కూడా అద్భుతంగా చేస్తాడనే టాక్ వినిపించింది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు మరింత స్లిమ్ గా తయారయ్యాడు. హీరో కటౌట్ కు ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లు రెడీ అయ్యాడు.
వైరల్ అవుతున్న మోక్షజ్ఞ రీసెంట్ పిక్
తాజాగా ఓ వేడుకలో మోక్షజ్ఞ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో వైట్ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి చక్కగా కనిపిస్తున్నాడు. ఇందులో తను స్లిమ్ బాడీతో హ్యాండ్సమ్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫోటో చూసి నందమూరి పిక్స్ చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా మోక్షజ్ఞకు ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్యకు మించి సినిమా పరిశ్రమలో రాణించాలని ఆయన నందమూరి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Nandamuri #Mokshagna Recent Pic at a marriage function pic.twitter.com/TKZemDndUX
— Milagro Movies (@MilagroMovies) February 22, 2024
‘ఆదిత్య 999’ ఎంట్రీ ఇస్తాడంటూ గతంలోనే ఊహాగానాలు
ఇప్పటికే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి పలు వార్తలు హల్ చల్ చేశాయి. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ తెరకెక్కిస్తానని బాలయ్య గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని అందరూ భావించారు. ఇందులో తండ్రి కొడుకులు ఇద్దరూ నటిస్తారని వార్తలు వినిపించాయి. అయితే, ఆ తర్వాత ఈ సినిమా విషయం మరుగునపడిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయంలోనూ క్లారిటీ లేదు.
మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు ఎవరు?
ఆ తర్వాత మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు ఇతడే అంటూ పలువురి పేర్లు వినిపించాయి. ముందు సింగీతం శ్రీనివాసరావు పేరు రాగా, ఆ తర్వాత పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపించింది. సినీ వారసులను బలంగా ప్రెజెంట్ చేయడం ఆయనకు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య నట వారసుడిని ఆయనే వెండితెరు పరిచయం చేస్తాడనే టాక్ వచ్చింది. ఆ తర్వాత బాలయ్యకు ఇష్టమైన దర్శకుడు బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది. రీసెంట్ గా బాలయ్యకు ‘భగవంత్ కేసరి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ టైంలో అనిల్ వర్క్ నచ్చిన తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను అనిల్‌కి అప్పగించారంటూ ప్రచారం నడిచింది. కానీ, ఇప్పటికీ వాస్తవం ఏంటో ఎవరికీ తెలియదు. ఇంచుమించి 5 ఏండ్లకు పైగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎప్పుడు అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియదు.
Read Also: ‘సుందరం మాస్టర్’ to ‘ఆర్టికల్ 370’ - ఈ రోజు, రేపు సందడి చేయనున్న సినిమాలు, సీరిస్‌లు ఇవే!