అన్వేషించండి
Advertisement
The Ghost: 'ది ఘోస్ట్' హిందీ రిలీజ్ - నాగార్జున రిస్క్ చేస్తున్నారా?
నాగార్జున తన ఘోస్ట్ సినిమాను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు.
నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో మొదలుపెట్టారు. అయితే.. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఇతర భాషల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టైలిష్ టేకింగ్, క్లాస్‌లో మాస్ చూపిస్తూ నాగార్జున చేసిన ఫైట్స్ ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైన రెండు వారాలకు థియేటర్లలోకి 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చింది. అందులో నంది అస్త్రాన్ని కాపాడే పాత్రలో నాగార్జున తన పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దీంతో నాగార్జున తన ఘోస్ట్ సినిమాను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు అన్నీ ఎప్పుడో అమ్మేసారు. ఇప్పుడు హీందీలో థియేటర్లలో విడుదల చేయాలంటే ఆ బయ్యర్ కి మాత్రమే సాధ్యం.
అయితే హిందీ బెల్ట్ లో థియేటర్లలో సినిమాను విడుదల చేయడమంటే చిన్న విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. తను అంత రిస్క్ చేయలేనని బయ్యర్ చెప్పేశారు. నిర్మాతది కూడా అదే మాట. ఈ క్రమంలో నాగార్జున గనుక ఖర్చులు భరిస్తే తాను హిందీలో సినిమా రిలీజ్ చేస్తానని.. ఒకవేళ మంచి ఆదాయం వస్తే అప్పుడు ఖర్చులు ఇవ్వాల్సిన పని లేదని బయ్యర్ కు నాగార్జునకు మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
ఖర్చులు రూ.4 కోట్ల వరకు అవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆదాయం రాకపోతే ఆ రిస్క్ తను భరిస్తానని చెప్పి.. నాగార్జున సినిమాను హిందీ బెల్ట్ లో విడుదల చేయిస్తున్నారట. 'బ్రహ్మాస్త్ర' తరువాత నాగ్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ ధీమాతోనే ఈ రిస్క్ చేస్తున్నట్లున్నారు. ఇక ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా నాగార్జున.. ఆంధ్రలోని వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ప్రాంతాల హక్కులు తీసుకున్నారు. వీటి మొత్తం బిజినెస్ చూసుకుంటే రూ.6 కోట్ల వరకు ఉంటుంది. సినిమా హిట్ అయితే నాగార్జునకు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ కలెక్షన్స్ రూపంలో దక్కుతుంది.
ఈ సినిమాలో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో చేసే సాహసమే ఈ సినిమా. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అక్టోబర్ 7న హిందీలో 'ది ఘోస్ట్' రిలీజ్:
నార్త్ ఇండియాలో 'ది ఘోస్ట్' హిందీ వెర్షన్ అక్టోబర్ 7న విడుదల కానుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ వెల్లడించారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిందీ రిలీజ్ ఉందా? లేదా? అని ఆయన్ను ప్రశ్నించగా... ''మా ప్లాన్‌లో లేదు. సెప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో డిసైడ్ చేశాం. తర్వాత కొంత కన్‌ఫ్యూజన్ నెలకొంది. చేయాలా? వద్దా?' అని! ఆ తర్వాత మనీష్ ఫోన్ చేసి హిందీలో కూడా విడుదల చేద్దామని అడిగారు. మేం ఓకే అన్నాం. కొంచెం లేటుగా ప్లాన్ చేశారు. ముందు చేసి ఉంటే బావుండేది'' అని సమాధానం ఇచ్చారు.
నార్త్ ఇండియాలో 'ది ఘోస్ట్' హిందీ వెర్షన్ అక్టోబర్ 7న విడుదల కానుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ వెల్లడించారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిందీ రిలీజ్ ఉందా? లేదా? అని ఆయన్ను ప్రశ్నించగా... ''మా ప్లాన్‌లో లేదు. సెప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో డిసైడ్ చేశాం. తర్వాత కొంత కన్‌ఫ్యూజన్ నెలకొంది. చేయాలా? వద్దా?' అని! ఆ తర్వాత మనీష్ ఫోన్ చేసి హిందీలో కూడా విడుదల చేద్దామని అడిగారు. మేం ఓకే అన్నాం. కొంచెం లేటుగా ప్లాన్ చేశారు. ముందు చేసి ఉంటే బావుండేది'' అని సమాధానం ఇచ్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
అమరావతి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion