(Source: ECI/ABP News/ABP Majha)
The Ghost Trailer: 'ది ఘోస్ట్ ట్రైలర్' - 'ఒక్కడిని కూడా వదలను' నాగార్జున యాక్షన్ పీక్స్!
గురువారం (ఆగస్ట్ 25) రోజున ది ఘోస్ట్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. గురువారం (ఆగస్ట్ 25) రోజున ది ఘోస్ట్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో చేసే సాహసమే ఈ సినిమా అని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంది. 'ఒక్కడిని కూడా వదలను' అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ లో ఓ పదునైన ఖడ్గాన్ని తయారు చేస్తూ చాలా సీరియస్‌గా కనిపించారు నాగ్. బీజీఎం కూడా ఎంతో ఇంటెన్స్‌గా అనిపించింది. ఈ ఎలిమెంట్స్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఈ టీజర్‌లో కనిపించింది. అదే "తమహగానే" (Thamahagane) అనే పదం. జపనీస్‌లో తమహగానే అంటే చాలా విలువైన ఉక్కు (Precious Steel).ఇది టీజర్ చివర్లో చూపించారు. ఈ స్టోరీలో ఈ ఖడ్గానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలియదు కానీ...జపాన్‌లో మాత్రం దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ దేశ చరిత్రను, ఆ విలువైన ఉక్కుని వేరు చేసి చూడలేం. ఇంతకీ ఈ ఉక్కుకి ఎందుకంత విలువ..? జపాన్‌లో మాత్రమే దొరుకుతుందా..? ఆ దేశ హిస్టరీకి ఈ స్టీల్‌కు లింక్ ఏంటి..? తెలుసుకుందాం.
ఏంటీ దీని ప్రత్యేకత..?
తమహగానే స్టీల్ చాలా అరుదైంది. జపాన్‌లో ఖడ్గాలు తయారు చేసే వాళ్లు మాత్రమే దీన్ని వినియోగిస్తారు. ఇందులో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే...కత్తులు చాలా షార్ప్‌గా తయారు చేసేందుకు వీలవుతుంది. ఉక్కులో కార్బన్ పెరిగే కొద్ది అది చాలా స్ట్రాంగ్‌గా, రఫ్‌గా తయారవుతుంది. తమహగానే (Thamahagane)స్టీల్‌లో 1-1.5% కార్బన్ ఉంటుంది. అయితే...ఈ కార్బన్ మోతాదు మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. మితిమీరితే మరీ పెళుసుగా తయారవుతుంది. మరీ తక్కువైతే ఖడ్గం ఎడ్జ్ సరిగా తయారు చేయలేరు. అందుకే..చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఈ ఖడ్గాన్ని తయారు చేస్తారు. కేవలం ఈ ఖడ్గాల్ని తయారు చేసే ఎక్స్‌పర్ట్స్ జపాన్‌లో చాలా మందే ఉంటారు. వీళ్లని "Swordsmith" అని అంటారు. "Spirit Of The Sword" అనే బుక్‌లో ఈ కత్తిని తయారు చేసే విధానం గురించి ఎంతో వివరంగా రాశారు రైటర్ స్టీవ్ షాకిల్‌ఫార్డ్ (Steve Shackleford). సాధారణ స్టీల్‌ను తయారీతో పోల్చుకుంటే...తమహగానే స్టీల్ తయారీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అందులో చెప్పారు.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?