అన్వేషించండి
Advertisement
Naga Chaitanya: నెపోటిజంపై నాగచైతన్య రియాక్షన్ ఇదే!
'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగచైతన్య వరుసగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు.
రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీలలో నెపోటిజం అనేది నెవెర్ ఎండింగ్ టాపిక్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ అనంతరం నెపోటిజం అనే పదం ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయింది. కావాలనే సుశాంత్ ను సినిమాల నుంచి బాలీవుడ్ బిగ్ స్టార్స్ తప్పించారని.. అన్ని భాషల సినీ పరిశ్రమల్లో నెపోటిజం ఉందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై చాలా మంది హీరోలు రియాక్ట్ అయ్యారు. తాజాగా నాగచైతన్యు కూడా నెపోటిజం గురించి మాట్లాడారు.
'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగచైతన్య వరుసగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో నెపోటిజంపై స్పందించారాయన. నెపోటిజం ప్రభావం బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో పెద్దగా కనిపించదని అన్నారు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్ధం కాదని చెప్పారు.
తన తాత, తండ్రి ఇద్దరూ స్టార్స్ అని.. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరగడంతో వారి ప్రభావం తనపై కచ్చితంగా ఉంటుందని.. వారిని చూసి తను కూడా నటుడు కావాలని ఆశ పడినట్లు చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని యాక్టర్ ని అయ్యాయని.. అలా వారు చూపించిన దారిలో పని చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ జర్నీ అలానే కొనసాగుతుందని చెప్పారు.
టాలీవుడ్ లో నెపోటిజం లేదని చెప్పడానికి ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఓ సెల్ఫ్ మేడ్ స్టార్ నటించిన సినిమా, తన సినిమా ఒకేరోజు విడుదలై.. తన సినిమా రూ.10 కోట్లు సాధించి, సెల్ఫ్ మేడ్ హీరో నటించిన సినిమా రూ.100 కోట్లు సాధిస్తే.. అందరూ అతడినే ప్రశంసిస్తారని.. దర్శకనిర్మాతలు కూడా అతడినే ముందుగా ఎప్రోచ్ అవుతారని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి రావడంతో తనకు ఎంట్రీ ఈజీగానే దొరికిందని.. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుందని చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన హీరో కొడుకు.. పెద్దయ్యాక హీరో అవ్వాలనుకుంటే నెపోటిజం పేరు చెప్పి అతడిని ఆపగలరా..? అంటూ ప్రశ్నించారు.
చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
ఇదిలా ఉండగా.. చైతు తన నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొచ్చాయి. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ సమయంలో పరశురామ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలొచ్చాయి. దీనికి బదులుగా చైతు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మొన్నామధ్య ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. మరి పరశురామ్ తో సినిమా ఉంటుందా..? ఉండదా..? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు నాగచైతన్య.
నిజానికి పరశురామ్ ఇంకా తనకు స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు చైతు. త్వరలోనే కథ చెబుతారని వెల్లడించారు. మీడియాలో వార్తలొస్తున్నట్లు అది డ్యూయల్ రోల్ స్టోరీ కాదని చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందు వెంకట్ ప్రభు సినిమా రెడీ అవుతుందని చెప్పారు చైతు. అంటే అప్పటివరకు పరశురామ్ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఎలా లేదన్నా.. మరో ఏడెనిమిది నెలల వరకు పరశురామ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
నిజానికి పరశురామ్ ఇంకా తనకు స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు చైతు. త్వరలోనే కథ చెబుతారని వెల్లడించారు. మీడియాలో వార్తలొస్తున్నట్లు అది డ్యూయల్ రోల్ స్టోరీ కాదని చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందు వెంకట్ ప్రభు సినిమా రెడీ అవుతుందని చెప్పారు చైతు. అంటే అప్పటివరకు పరశురామ్ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఎలా లేదన్నా.. మరో ఏడెనిమిది నెలల వరకు పరశురామ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
Also Read : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion