News
News
X

Naga Chaitanya: టైమ్ ట్రావెల్... జర్నలిజం... నాగచైతన్య స్క్రిప్ట్ కోసం పెద్ద స్కెచ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని స్క్రిప్ట్ కోసం పెద్ద స్కెచ్ వేశారు.

FOLLOW US: 
Share:

దర్శకుడు విక్రమ్ కె. కుమార్ రూటే సపరేటు! ఆయన తీసిన సినిమాలు చూస్తే... ఆ విషయం అర్థం అవుతుంది. '13 బి', 'ఇష్క్', 'మనం', '24', 'హలో', 'నాని గ్యాంగ్ లీడర్'... డిఫరెంట్ జానర్ సినిమాలు తీశారు. ఇప్పుడు నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోలు ఏయన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో విక్రమ్ కె. కుమార్ 'మనం' తీశారు. అందులో అఖిల్ అతిథి పాత్రలో కనిపించారు. తర్వాత అఖిల్ హీరోగా 'హలో' తీశారు. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న 'థాంక్యూ'కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగా... వాళ్లిద్దరూ మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య,  దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. డిసెంబర్ చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారట. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా... 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీసేలా పెద్ద స్కెచ్ వేశారట. నాగ చైతన్యకు జోడిగా ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించనున్నారు.
ఈ వెబ్ సిరీస్, 'థాంక్యూ' సినిమా కాకుండా తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ 'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడితే... ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిలిం నగర్ టాక్. 

Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ మీటింగ్‌... 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' గురించి కొత్త అప్‌డేట్‌!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 06:54 PM (IST) Tags: Time Travel concept Thank you movie Akkineni Naga Chaitanya Vikram K Kumar Naga Chaitanya First Web Series అక్కినేని నాగచైతన్య Priya Bhavani Shankar

సంబంధిత కథనాలు

Pathaan BO Collections, Day 5: ఐదు రోజుల్లో రూ.500 కోట్లు అవుట్ - కొత్త రికార్డులు రాస్తున్న పఠాన్!

Pathaan BO Collections, Day 5: ఐదు రోజుల్లో రూ.500 కోట్లు అవుట్ - కొత్త రికార్డులు రాస్తున్న పఠాన్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!