అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Naga Chaitanya: సమంతని ఫాలో అవుతున్న చైతు.. ఈ టైమ్‌లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో!

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చాలు ఏ రోల్ కి అయినా సై అంటున్నారు నేటి హీరోలు. ఇప్పుడీ లిస్టులో చేరాడు అక్కినేని నాగచైతన్య.

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలైన తర్వాత ఫిలిం మేకర్స్ సరికొత్త కంటెంట్ ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఓటీటీలదే హవా అని అర్థమైన  హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు హీరోయిజాన్ని మాత్రమే ప్రదర్శించాలనే ఆలోచన నుంచి నేటి హీరోలు బయటకు వచ్చేశారు. ఫ్యాన్స్ హర్టవుతారనే ఆలోచనతో ఒకే చట్రంలో ఉండిపోవడం లేదు. పాత్ర ఏంటన్నది కాదు దాని వెయిట్ ఎంతో చూస్తున్నారు. అందుకే హీరోలు కూడా నెగెటివ్ రోల్ చేయడానికి అస్సలు ఆలోచించడం లేదు. ఇప్పటికే రానా ‘బాహుబలి’లో భళ్లాల దేవగా ఓ రేంజ్  క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లోనూ ఓ మూవీలో విలన్‌గా మెప్పించాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. కూల్ హీరో నాని కూడా ‘వి’ సినిమాలో ప్రతినాయకుడి ఛాయలున్న రోల్ పోషించాడు. ఇప్పుడీ లిస్టులో చేరాడు నాగచైతన్య.

Also Read: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ

ఓ వైపు సోలో హీరోగా, మల్టీ స్టారర్ మూవీస్.. క్లాస్, మాస్ అన్ని క్యారెక్టర్స్ లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న నాగ చైతన్య ఇప్పుడు రూట్ మారుస్తున్నాడు. త్వరలో విలన్‌గా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలైపోవడంతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతూ త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు. ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నానని చెప్పాడు. ఈ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించనున్నాడట. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని వెల్లడించాడు చైతన్య.

Also Read:అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు చైతూ తీసుకున్న ఈ నిర్ణయం సంగతి విన్న అభిమానులు నిజంగా ఇది డేర్ స్టెప్పే అంటున్నారు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ సులువుగా దొరికినా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు చైతూ. మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమా హిట్టు-ఫట్టు అనే సంబంధం లేకుండా తన పాత్రకు న్యాయం చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్, పైగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అంటే ఎలా ఉంటుందో అంటున్నారు అభిమానులు. మరోవైపు ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ తో సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు చైతూ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటి ఫలితాలనే ఇస్తుందంటున్నారు అభిమానులు.

Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget