News
News
X

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

'శంకరాభరణం' సినిమా విడుదలైన కొత్తల్లో ఫ్లాప్ అయిందట. ఆ తరువాత మౌత్ టాక్ తో క్లాసిక్ హిట్ గా నిలిచిందట. తన సినిమాకి కూడా అలాంటి మౌత్ టాక్ మొదలైందనేది ఎమ్మెస్ రాజు మాట.

FOLLOW US: 

గత శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే మరోపక్క మాత్రం సక్సెస్ టూర్స్, మీటింగ్ పెడుతున్నారు. తమ సినిమా సూపర్ హిట్ అంటూ యాడ్స్ కూడా ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అన్ని టాక్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు ఇలానే చేస్తున్నారు. అదే అతి అనుకుంటే.. ఇప్పుడు ఈ ప్లాప్ సినిమాలు తీసిన దర్శకనిర్మాతల మాటలు కోటలు దాటుతున్నాయి. రీసెంట్ గా ఎమ్మెస్ రాజ్ తను తీసిన '7 డేస్ 6 నైట్స్' గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను క్లాసిక్ మూవీ 'శంకరాభరణం'తో పోల్చారు. 

'శంకరాభరణం' సినిమా విడుదలైన కొత్తల్లో ఫ్లాప్ అయిందట. ఆ తరువాత మౌత్ టాక్ తో క్లాసిక్ హిట్ గా నిలిచిందట. తన సినిమాకి కూడా అలాంటి మౌత్ టాక్ మొదలైందనేది ఎమ్మెస్ రాజు మాట. ఈ సినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారని చెబుతున్నారాయన. ఇంటికి వెళ్లిన తరువాత కూడా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని తన సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. 

ఈ సినిమాతో పాటు విడుదలైన 'సమ్మతమే' సినిమాకి కూడా ప్లాప్ టాకే వచ్చింది. కానీ ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం మాత్రం తమ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. గతంలో ఇతడు చేసిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాకు కూడా ఇలానే మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిందట. ఆ తరువాత సినిమా బ్లాక్ బస్టర్ అయిందని.. ఇప్పుడు 'సమ్మతమే' విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు. ఇక 'చోర్ బజార్' సినిమా గురించి ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఈ సినిమాతో తను మాస్ హీరోగా జనాల్లోకి వెళ్లిపోయానని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో కూడా సినిమాలకు నెగెటివ్ టాక్ వస్తే లైట్ తీసుకునేలా లేరు మన మేకర్స్. 

Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!

Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్

View this post on Instagram
 
A post shared by MS Raju (@msrajuofficial)

View this post on Instagram
 
A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

Published at : 27 Jun 2022 09:06 PM (IST) Tags: Tollywood Sammathame Chor Bazar 6 days 7 nights

సంబంధిత కథనాలు

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 - కొత్త ప్రోమో చూశారా?

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 - కొత్త ప్రోమో చూశారా?

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam In Netflix: ఏవండోయ్ ఇది విన్నారా! సినిమాగా 'కార్తీకదీపం' సీరియల్

Karthika Deepam In Netflix:  ఏవండోయ్ ఇది విన్నారా! సినిమాగా 'కార్తీకదీపం' సీరియల్

Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?

Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?

టాప్ స్టోరీస్

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!