అన్వేషించండి

Money Heist: ‘మనీ హైస్ట్’ ట్రైలర్: ముగింపు మామూలుగా ఉండదట.. ప్రొఫెసర్‌ ఏం చేస్తారో!

మనీ హైస్ట్.. వాల్యూమ్ 2లోని పార్ట్ 5 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలతో ‘మనీ హైస్ట్’ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు.

‘మనీ హైస్ట్’ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే ఈ వెబ్ సీరిస్ చివరి దశకు వచ్చేసింది. డిసెంబరు 3 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానున్న వాల్యూమ్ 2, పార్ట్ 5 ఎపిసోడ్స్‌ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్.. అన్నీ సీజన్లను గుర్తు చేస్తూ ఓ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేసింది. మొదటి పార్ట్ కంటే రక్తికట్టించే విధంగా రెండో పార్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. నరాలు తెగె ఉత్కంఠ మధ్య రెండో పార్ట్‌ను మధ్యలోనే ఆపేశారు. ఇప్పటికే ప్రసారమైన పార్ట్ 2 ఎపిసోడ్స్‌లో.. సైన్యం రంగంలోకి దిగడంతో ప్రొఫెసర్ టీమ్‌ కష్టాల్లో పడింది. తమ టీమ్ సభ్యులను కాపాడేందుకు టోక్యో ఆత్మహుతికి పాల్పడి సైనికులను చంపేసింది. మరోవైపు ప్రొఫెసర్ కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కాడు. అయితే, ఆమె ప్రసవంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రొఫెసర్‌కు సాయం చేస్తుందా? లేదా అతడిని పట్టుకుని మళ్లీ తన సత్తా చాటుతుందా అనేది చూడాలి. 

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో ప్రోఫెసర్ తన డెన్‌ను వదిలేసి బ్యాంక్ వద్దకు వస్తున్నట్లు చూపించారు. రెడ్ కలర్ కారులో బ్యాంక్ వద్దకు చేరుకున్న ప్రొఫెసర్‌కు సైన్యం లోపలికి వెళ్లేందుకు దారి ఇవ్వడాన్ని ట్రైలర్‌లో చూడవచ్చు. అయితే, ప్రొఫెసర్ అక్కడికి చేరుకోడానికి ముందు పోలీస్ ఆఫీసర్‌తో పోరాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఛేజింగ్ సీన్లను ట్రైలర్‌లో చూపించారు. మరో వైపు ఓ మహిళ సైనికురాలు బ్యాంకులో ప్రొఫెసర్ టీమ్‌తో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.  

“మేము ఒక మిషన్‌ను పూర్తి చేయడానికి ఇక్కడకు వచ్చాం. ఈ దోపిడీకి ముగింపు పలకండి” అని సైన్యం వార్నింగ్ ఇస్తారు. పలెర్మో (రోడ్రిగో డి లా సెర్నా)  స్పందిస్తూ ‘‘మనం ఇక్కడి నుంచి బయట పడగలమా అని సందేహంగా ఉంది’’ అని అంటాడు. హెల్సింకి (డార్కో పెరిక్) “నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తావు. నువ్వు నాకు వాగ్దానం చేసావు’’ అని అంటాడు. బ్యాంక్‌లోకి ఎంట్రీ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తాడు? సైన్యానికి లొంగిపోతారా? లేదా మరో కొత్త ప్లాన్‌తో తప్పించుకుంటారా? అయితే, ప్రొఫెసర్‌ ఎత్తులు వేయడంలో దిట్ట.. ఈ సీజన్‌లో ఏ ప్లాన్ లేకుండా పోలీసులకు లొంగిపోతే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మరి, ఈ సీరిస్ ఇంతటితో ముగుస్తుందా.. కొనసాగుతుందా అనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

‘మనీ హైస్ట్’ ట్రైలర్: 

‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్: 

Also Read: ‘మనీ హీస్ట్’ సీజన్ 5 To ‘డోన్ట్ లుక్ అప్’.. డిసెంబర్‌లో విడుదలయ్యే ఓటీటీ వె‌బ్‌సీరిస్‌లు ఇవే..

Also Read: ఇప్పుడు చిరంజీవితో సినిమా... తర్వాత దగ్గుబాటి హీరోతోనూ ఓ సినిమా: వెంకటేష్
Also Read: వెండితెరపైనే కాదు.. ఓటీటీలో కూడా బాలయ్య రికార్డులు.. ‘దబిడి దిబిడే’

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Lung Cancer : స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
New Maruti Suzuki Swift: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ లాంచ్ డేట్ ఫిక్స్ - వచ్చే నెలలో ఎప్పుడంటే?
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ లాంచ్ డేట్ ఫిక్స్ - వచ్చే నెలలో ఎప్పుడంటే?
Embed widget