Mission Majnu: ‘మిషన్ మజ్ను’ కోసం రష్మిక మందన్న అంత రెమ్యునరేషన్ తీసుకుందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న కలిసి నటించిన తాజా మూవీ ‘మిషన్ మజ్ను’. శంతను బాగ్చి దర్శకత్వం వహించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.
శంతను బాగ్చీ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 70వ దశకంలో అణ్వాయుధ కార్యక్రమాన్ని బహిర్గతం చేసే రహస్య మిషన్‌పై పాకిస్తాన్‌కు వెళ్లే గూఢచారి(అమన్‌దీప్ సింగ్/తారిక్) చుట్టూ తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల కారణంగా, తారిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మిషన్ ఎలా సక్సెస్ చేశాడు? అనేదే సినిమా కథ. ఈ చిత్రంలో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మిషన్ మజ్ను’లో RAW ఆఫీసర్‌గా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా భారీ పారితోషికాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో తమ పాత్రల కోసం మిగతా నటీనటులు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రష్మిక మందన్న
‘వారిసు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ మూవీలో అంధురాలు (నస్రీన్) పాత్రలో కనిపించింది. టెలీ చక్కర్, బాలీవుడ్ లైఫ్ ప్రకారం, ఈ సినిమాలో తన నటనకు గాను రష్మిక మందన్న రూ. 3 కోట్లు తీసుకుంది.
పర్మీత్ సేథి
షారుఖ్ ఖాన్, కాజోల్‌లతో కలిసి ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన పర్మీత్ సేథి ‘మిషన్ మజ్ను’లో కావో అనే ఏజెంట్ పాత్రను పోషించాడు. ఈ 56 ఏళ్ల నటుడు ఈ చిత్రంలో నటించినందుకు గాను రూ. 75 లక్షలు వసూలు చేశాడు.
షరీబ్ హష్మీ
అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న షరీబ్ హష్మీ, శంతను బాగ్చి దర్శకత్వం వహించిన ‘మిషన్ మజ్ను’ కోసం రూ. 55 లక్షల పారితోషికం తీసుకున్నారు.
మీర్ సర్వర్
గతంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘ఐయారీ’, ‘షేర్షా’ లాంటి చిత్రాలలో పని చేసిన మీర్ సర్వర్, ఈ లేటెస్ట్ స్పై థ్రిల్లర్‌లో తన పాత్ర కోసం రూ. 40 లక్షలు తీసుకున్నారు.
కుముద్ మిశ్రా
అర్జున్ కపూర్ హీరోగా నటించిన ‘కుట్టే’లో మంచి నటన కనబర్చిన కుముద్ మిశ్రా, ‘మిషన్ మజ్ను’లో గూఢచారి పాత్రలో కనిపించారు. తెలీ చక్కర్ ప్రకారం ఈ నటుడు రూ. 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు.
అర్జన్ బజ్వా
‘గురు’, ‘రుస్తుమ్’, ‘ఫ్యాషన్’ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించారు అర్జన్ బజ్వా. ఈ గూఢచారి డ్రామా కోసం రూ. 25 లక్షలు తీసుకున్నారు.
రజిత్ కపూర్
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయిన రజిత్ కపూర్ ‘మిషన్ మజ్ను’లో తన నటనకు రూ.25 లక్షలు వసూలు చేశారు. అసాధారణమైన పాత్రల ఎంపిక, అద్భుత నటకు ఆయన కేరాఫ్ గా కొనసాగుతున్నారు.
సిద్ధార్థ్ మల్హోత్రా
అలియా భట్, వరుణ్ ధావన్ సరసన కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు సిద్ధార్థ్ మల్హోత్రా. ‘మిషన్ మజ్ను’ మూవీలో మెయిన్ లీడ్ ప్లే చేసిన ఆయన రూ. 7 కోట్లు వసూలు చేశాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ రా ఆఫీసర్‌గా నటించాడు.
Read Also: మోదీపై అక్షయ్ కుమార్ ప్రశంసలు - ఎందుకంటే..