News
News
X

Boss Party Song Trolls: బాస్ పార్టీ సాంగ్‌పై ఫన్నీ ట్రోల్స్ - దేవీశ్రీని ఆడేసుకుంటున్న నెటిజన్స్

బాస్ పార్టీ పాట ప్రోమోలో ట్యూన్, లిరిక్స్ చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలింది.

FOLLOW US: 
 
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాకు కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది మూవీ టీమ్. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. బాస్ పార్టీ అంటూ విడుదల చేసిన ఈ ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్ మార్క్ కనిపించేలా మాస్ బీట్స్, దేవి డైలాగ్స్ తో మొదలవుతుంది. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

దేవిశ్రీప్రసాద్ మాస్ పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్. గతంలోనూ చిరంజీవికి మంచి పాటలు అందించారు. ఈ సినిమాకు కూడా మాస్ బీట్స్ అందించినట్లుగానే తెలుస్తోంది. గతంలో ‘పుష్ప’ సినిమాకు కూడా వారానికో పాట విడుదల చేశారు డిఎస్పీ. 'వాల్తేరు వీరయ్య'కు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టున్నారు. అయితే బాస్ పార్టీ సాంగ్ ప్రోమో పై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సాంగ్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటే ఇంకొంత మంది మాత్రం ఇదేం పాటరా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఈ బాస్ పార్టీ పాట ప్రోమోలో ట్యూన్, లిరిక్స్ చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలింది. అసలే ప్రస్తుతం దేవి పరిస్థితి బాగోలేదు. మొన్నామధ్య ఓ పరి సాంగ్ తో వివాదంలో చిక్కుకున్న దేవి మళ్ళీ ఇప్పుడు బాస్ పార్టీ సాంగ్ ప్రోమో తో విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ పాట ప్రోమో ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఆ ప్రోమో పై వెటకారంగా మేమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడవి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే కొంతమంది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు. దేవి పాటలు మొదట్లో అలాగే ఉంటాయని కానీ ఆ తర్వాత మెల్లగా ఎక్కేస్తాయని సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాటలు సూపర్ హిట్ గా అనిపిస్తాయని అంటున్నారు. గతంలో కూడా 'పుష్ప' సినిమా పాటల్ని ఇలాగే ట్రోల్ చేశారు. ఆ మూవీ పాటలు అసలేం బాలేవని కామెంట్లు చేశారు. కానీ ఆ పాటలే తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయంటూ కామెంట్స్ చేస్తున్నారు దేవి సపోర్టర్స్.

News Reels

Read Also: ‘బేబీ’కి రౌడీ బాయ్, రష్మిక మద్దతు, టీజర్ బాగుందంటూ ప్రశంసలు!

మొత్తంగా బాస్ పార్టీ సాంగ్ ప్రోమో పై సోషల్ మీడియాలో సైలెంట్ వార్ నడుస్తుందనే చెప్పాలి. ఇక ఈ బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ను నవంబర్ 23 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది మూవీ టీమ్. మరి ఈ పాట ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తోందో చూడాలి. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది.

View this post on Instagram
 
A post shared by wear mask get vacinated (@single.animutyam)

Published at : 22 Nov 2022 05:25 PM (IST) Tags: Devi Sri Prasad Waltair veerayya Chiranjeevi Boss party song

సంబంధిత కథనాలు

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !