అన్వేషించండి

Chiranjeevi tweet: రవితేజ గురించి చెప్పనందుకు ఫీలవుతున్నా, తను నటించకపోతే ఈ మూవీ అసంపూర్ణంగా ఉండేది- చిరంజీవి

‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ లో రవితేజ గురించి చెప్పకపోవడం పట్ల చిరంజీవి బాధపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన, రవితేజ చేయకపోయి ఉంటే ఈ సినిమా అసంపూర్ణంగా ఉండేదన్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో  మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని మూవీ సెట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవితోపాటు రవితేజ, రాజేంద్రప్రసాద్, ఉర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. 

రవితేజ గురించి చెప్పడం మర్చిపోయా!

ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక సిబ్బంది చాలా శ్రమించారని తెలిపారు. ఈ మూవీలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు. బాబీ తన ప్రాణం పెట్టి తీసిన మూవీ అని కొనియాడారు. అనంతరం ఈ మూవీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు చెప్పారు. అయితే, ప్రెస్ మీట్ లో రవితేజ గురించి చెప్పకపోవడం పట్ల చిరంజీవి ఫీలయ్యారు. అనంతరం, ట్విట్టర్ వేదికగా సినిమా కోసం రవితేజ పడిన కష్టాన్ని వివరించారు.

తను చేయకపోతే మూవీ అసంపూర్ణంగా ఉండేది!

“’వాల్తేరు వీరయ్య’ టీం అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీమ్ అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీలో వాళ్ల వాళ్ల మెమరీస్ పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా జరిగింది. అయితే, నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడుదామని అనుకోవడంలో, చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఈ విషయమై ఎంతో వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నేంచి, కలిసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్లీ ఇన్నేళ్లలకి చేయటం నాకెంతో ఆనందం అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయి ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాకుందాం” అని చిరంజీవి వివరించారు.

అటు ‘వీరసింహారెడ్డి’,  ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలను సంక్రాంతికే విడుదల చేయడం, ఈ రెండు సినిమాలకు నిర్మాతలు కూడా ఒకరే కావడంపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘సినిమాకు నిర్మాతలు  చాలా ప్రధానం. వారి సినిమాలో నటించిన తర్వాత మా పని పూర్తవుతుంది. ఆ తర్వాత మేం ఎందులోనూ జోక్యం చేసుకోం” అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.  అటు పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడనే ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘ఏ హీరోతోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్దమే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. ముందు అవి పూర్తికావాలి. సుమారు రెండేళ్లు పడుతుందేమో’’ అని చెప్పారు. ‘‘మనం దేనికైనా కమిట్ అయినప్పుడు.. దానికి న్యాయం చేయాలి. ఆ అవసరం లేదు అనిపించిన రోజున రిటైర్డ్ అయిపోవడమే ఉత్తమం”అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.

ప్రీ రిలీజ్ పంక్షన్ లోనే మాట్లాడుతా!

రవితేజ ఈప్రెస్ మీట్ లో ఏం మాట్లాడలేదు. ఇక్కడ రెండు ముక్కలు కూడా మాట్లాడను. అన్ని ముక్కలూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే మాట్లాడుతానని చెప్పారు.

Read Also: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jailer 2: కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 
కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 
Anirudh Ravichander Remuneration: బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Actor Lathish: ఉప్పు దొంగతనం నుంచి విలన్‌గా... నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నటుడు
ఉప్పు దొంగతనం నుంచి విలన్‌గా... నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నటుడు

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Embed widget