Tollywood Female stars: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో వర్ధమాన హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. కృతి శెట్టి, మీనాక్షి చౌదరి, శ్రీ లీల వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. 2023లోనూ వీరి దూకుడు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
![Tollywood Female stars: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా? Tollywood 2023, rising female stars, meet Krithi Shetty, Meenakshi Chaudhary and Sree Leela Tollywood Female stars: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/a429fd9940acec44c5bad943fc1ededa1672149051703239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెండు సంవత్సరాల క్రితం హీరోయిన్లుగా టాలీవుడ్ కు పరిచయమైన కృతి శెట్టి, మీనాక్షి చౌదరి, శ్రీలీల, ఇప్పుడు వరుస సినిమాలో జోష్ మీదున్నారు. 2023లోనూ అవకాశాలు క్యూలో ఉన్నాయి. వీరి దూకుడు చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ టాప్ 5 హీరోయిన్ల లిస్టులో చేరే అవకాశం కనిపిస్తోంది.
కృతి శెట్టి
19 ఏళ్ల ఈ కన్నడ బ్యూటీ మంగళూరులో పుట్టి పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కు చేరింది. ఈ ముద్దుగుమ్మ 2019లో హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో చక్కటి పాత్ర పోషించి ఆకట్టుకుంది. 2021లో ‘ఉప్పెన’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి అద్భుత నటన కనబర్చింది. ఈ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేసింది. ఆ తర్వాత ‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో ఆకట్టుకుంది. కానీ, వాటిలో ‘బంగార్రాజు’ మినహా మిగతావన్నీ ఫ్లాప్. ఇప్పుడు టోవినో థామస్‌తో మలయాళ చిత్రంలో నటిస్తోంది. నాగ చైతన్యతో కలిసి తెలుగు-తమిళ చిత్రంలో చేస్తోంది. అవి హిట్ కొడితే.. మళ్లీ అవకాశాలు క్యూకడతాయి. లేదంటే.. 2023 కూడా చేదు గుర్తుగా మిగిలిపోతుంది.
View this post on Instagram
మీనాక్షి చౌదరి
అందాల తార మీనాక్షి చౌదరి ఫెమినా మిస్ ఇండియా 2018 కీరీటాన్ని దక్కించుకుంది. బహుశా ఆరోజు తను ఊహించి ఉండదు, రెండు సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమలో పాపులర్ నటి అవుతానని. మీనాక్షి 2021లో సుశాంత్ హీరోగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. 2022లో రవితేజతో ‘ఖిలాడి’, అడవి శేష్ తో కలిసి ‘HIT: ది సెకండ్ కేస్’లో నటించింది. అటు తమిళంలో ‘కొలైని’ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. 2023లో ఈ సినిమా విడుదల కానుంది.
View this post on Instagram
శ్రీ లీల
మెడికల్ స్టూడెంట్ గా కొనసాగుతూనే హీరోయిన్ గానూ రాణిస్తోంది శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కేవలం 21 సంవత్సరాల వయస్సులో శ్రీ లీల నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ‘పెళ్లిసందD’తో ఆకట్టుకున్న ఈ అమ్మడు, తాజాగా రవితేజతో ‘ధమాకా’ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల్లో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పంజా వైష్ణవ్ తేజ్, నితిన్‌లతో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మూవీలోనూ ఆమె నటించనుంది. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ 2023లో ఓరేంజిలో దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది.
Read Also: అజిత్ కంటే విజయ్ పెద్ద స్టారా? త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)