అన్వేషించండి

మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణ వీరాభిమానే కాదు, అభిమాన సంఘం అధ్యక్షుడు కూడా!

తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. ఆయన నటుడిగా మారక కూడా, అభిమాన సంఘం అధ్యక్షుడిగా చాలా కాలం పాటు కొనసాగారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. ‘ఇండియన్ జేమ్స్ బాండ్’గా గుర్తింపు తెచ్చుకున్నఈ మేటి నటుడు ఎన్నో అద్భుత సినిమాల్లో కథానాయకుడిగా చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఎంత కష్టపడ్డారు. ఆయన మరణం పట్ల  టాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమలు నివాళులర్పిస్తున్నాయి. పలువురు సినీ దిగ్గజాలు ఆయన మృతి పట్ల సంతాపం చెప్తున్నాయి. ఇదే సమయంలో కృష్ణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి కృష్ణ-చిరంజీవి నడుమ ఓ విడదీయలేని అనుబంధం ఉంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కృష్ణ పేరిట 2,500 ఫ్యాన్స్ అసోసియేషన్లు

కృష్ణ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. సాధారణ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి సూపర్ స్టార్ రేంజికి ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని ఎన్నో అంశాలను ఆయన స్పృశించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఒకటేమిటి అనేక విషయాల్లో ఆయన మేటి అనిపించుకున్నారు. సినిమా పరిశ్రమలోనే 24 క్రాఫ్ట్స్ లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన సినిమాలు చూసి ఎంతో మంది తనకు వీరాభిమానులుగా మారిపోయారు. ఒకానొక సమయంలో ఆయనకు 2500కు పైగా అభిమాన సంఘాలు ఉండేవంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆయన సినిమా విడుదల అయినా, పుట్టిన రోజు జరుపుకున్న ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండేది కాదు. ఏదైనా పండుగ జరుగుతుందా? అనేలా సెలబ్రేట్ చేసే వాళ్లు.  పేదలకు వస్త్రదానాలు, రోగులకు పండ్ల పంపిణీ, మరికొంత మంది రక్తదాన శిబిరాలు, ఇంకొందరు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కృష్ణ హీరోగా కొనసాగినంత కాలం అభిమాన సంఘాలు ఎంతో యాక్టివ్ గా ఉండేది. ఆయన అప్పుడప్పుడు తమ అభిమాన సంఘాలన నాయకులను కలిసి మంచి చెడులు తెలుసుకున్న సందర్భాలున్నాయి.

హీరోగా మారిన తర్వాత కూడా కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడుగా చిరు

 సూపర్ స్టార్ కృష్ణ 2008 నుంచి సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. అప్పటి నుంచి అభిమాన సంఘాలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అభిమానులున్న నటుడు కూడా ఆయనే. అయితే, అంతటి హీరో కూడా ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ఆయన చాలా కాలం అధ్యక్షుడిగా కొనసాగారు కూడా.  ‘తోడు దొంగలు’ సినిమా ప్రచారంలో భాగంగా  ఓ పాంప్లెంట్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి పేరు కనిపించింది. అప్పటికి చిరంజీవి నటుడిగా కొనసాగుతుండటం విశేషం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో కృష్ణతో కలిసి చిరంజీవి నటించడం విశేషం. మొత్తంగా కృష్ణ-చిరంజీవి నడుమ ఎంతో అనుబంధం ఉండేది.  

Read Also: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 7th: నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
Sunday OTT Movies : దీపావళి సండే స్పెషల్... ఓటీటీల్లో సినిమాల సందడి - టాప్ 10 మూవీస్ అస్సలు మిస్ కావొద్దు
దీపావళి సండే స్పెషల్... ఓటీటీల్లో సినిమాల సందడి - టాప్ 10 మూవీస్ అస్సలు మిస్ కావొద్దు
Sai Durgha Tej Kiran : కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
Surekha Vani : 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్
'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget