Chiranjeevi: ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం, బ్రహ్మానందం ఆత్మకథపై మెగాస్టార్ ప్రశంసలు
Chiranjeevi: హాస్యనటుడు బ్రహ్మానందం ‘నేను మీ బ్రహ్మానందం‘ అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. తాజాగా ఈ పుస్తకాన్ని అందుకున్న మెగాస్టార్, బ్రహ్మీపై ప్రశంసలు కురిపించారు.
Chiranjeevi About Brahmanandam Autobiography: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పెదగ్గా పరిచయం అవసరం లేదు. ఆయన పేరు వినగానే నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బడి పంతులు నుంచి నటుడిగా మారిన ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అద్భుత కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కేవలం ఒకటి రెండు సినిమాల్లోనే కనిపించారు. ఇంటి దగ్గరే ఉంటున్న బ్రహ్మీ, తాజాగా తన ఆటో బయోగ్రఫీని రాశారు. ‘నేను మీ బ్రహ్మానందం‘ పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఈ బుక్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మీపై ప్రశంసల జల్లు కురిపించారు.
తన ఆటో బయోగ్రఫీ కాపీని చిరు దంపతులకు అందించిన బ్రహ్మీ
కమెడియన్ బ్రహ్మానందం తాజాగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. తన ఆటోబయోగ్రఫీ కాపీని చిరు దంపతులకు అందించారు. ఈ పుస్తకం గురించి, బ్రహ్మానందం గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఆయన చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీనిని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఈ పుస్తక ప్రచురణ కర్తలను అభినందిస్తున్నా’’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
View this post on Instagram
తొలి కాపీని తన భార్యకు అందించిన హాస్యబ్రహ్మ
అటు తన ఆత్మకథకు సంబంధించిన తొలి ప్రతిని బ్రహ్మానందం తన భార్యకు అందించారు. ఈ విషయాన్ని తన కొడుకు గౌతమ్ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. “‘నేను: మీ బ్రహ్మానందం‘ అనేది మా నాన్నగారి ప్రయాణం యొక్క సమగ్ర ఆత్మకథ. ఇది ఆయన కృషి, నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన నైపుణ్యానికి నిదర్శనం. ఈ పుస్తకం తొలి కాపీని మా అమ్మ లక్ష్మీకి అందించారు” అని వెల్లడించారు.
View this post on Instagram
బడి పంతులు నుంచి స్టార్ కమెడియన్ వరకు…
బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు అధ్యాపకుడిగా పని చేశారు. ఆ తర్వాత అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ‘చంటబ్బాయ్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. కమెడియన్ గా వందల చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బడి పంతులు స్థాయి నుంచి సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ కమెడియన్ గా బ్రహ్మీ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..