Mega Star Chiru: 'మా'లో అలా జరుగుతుందనుకోలేదు.. భవిష్యత్ లో జరగకుండా చూస్తాం
మా ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. అగ్ర కథానాయకులు ముందే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మా ఎన్నికల్లో అగ్ర తారలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటును వేశారు. అయితే తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొ్న్నారు. ఎన్నికల ఇంత హీట్ పుట్టిస్తున్నాయేంటని.. మీడియా అడిగిన ప్రశ్నకు అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని చిరు చెప్పారు. భవిష్యత్ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని చిరంజీవి అన్నారు.
Also Read: MAA Elections Betting: 'మా' పోలింగ్ ప్రారంభం.. లక్షల్లో బెట్టింగ్.. మరెవరు గెలుస్తారో..?
మరోవైపు 'మా' ఎన్నికల్లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రామ్‌చరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్ చరణ్ తో పాటు సుమ, శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, రాఘవ తదితరులు ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు.
Also Read: MAA Elections Live Updates: ‘మా’ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
అంతకుముందు పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.
Also Read: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎలక్షన్స్ మరింత హీటెక్కించాయి. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నడుమ హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న రచ్చకు నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది. మొత్తం 883 మంది సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు.
Also Read: 'నాకు నేనే కింగ్..' షణ్ముఖ్ కామెంట్ కి నాగార్జున పంచ్..
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి